English | Telugu

లెజెండరీ యాక్టర్ ధర్మేంద్ర మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం 

బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ధర్మేంద్రతో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ చిరంజీవి ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. (Dharmendra)

"శ్రీ ధర్మేంద్ర గారు కేవలం ఒక గొప్ప నటుడు మాత్రమే కాదు, ఒక అద్భుతమైన మానవతావాది కూడా. నేను ఆయనను కలిసిన ప్రతిసారీ ఆయన ప్రదర్శించే వినయం, ఆప్యాయత నా హృదయాన్ని లోతుగా తాకాయి. ఆయనతో నేను పంచుకున్న మధురమైన జ్ఞాపకాలను, వ్యక్తిగత క్షణాలను నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను.

ఆయన మృతి పట్ల నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. నా ప్రియ మిత్రులు సన్నీ డియోల్ మరియు బాబీ డియోల్‌తో పాటు వారి కుటుంబ సభ్యులకు నా ప్రార్థనలు మరియు ఆలోచనలు తోడుగా ఉంటాయి. ఆయన వారసత్వం కోట్లాది మంది హృదయాల్లో ఎప్పటికీ సజీవంగా ఉంటుంది. ఓం శాంతి" అంటూ మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం