English | Telugu

అగ్ర కమెడియన్ మృతి.. విషాదంలో ఇండస్ట్రీ 

ఒక లెజండ్రీ నటుడి సినీప్రస్థానం గురించి చెప్పుకోవాలంటే ఆయన చేసిన చిత్రాల మొత్తం గురించి చెప్పుకోవాల్సిన పని లేదు. మచ్చుకి కొన్నిచిత్రాలైనా చాలు. అటువంటి ఒక లెజండ్రీ నటుడు 'సతీష్ షా'(Satish Shah).హమ్ ఆప్ కె హై కౌన్(Hum Aapke hain koun),దిల్ వాలే దుల్హనియా లేజాయాంగే(Dilwale Dulhania Le Jayenge)చిత్రాల్లో అజిత్ సింగ్, డాక్టర్ సింఘాల్ క్యారెక్టర్స్ లలో ఆయన కనపరిచిన పెర్ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.సతీష్ షా కోసం కూడా ఆయా చిత్రాలు రిపీట్ గా చూసిన వాళ్ళు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. కామెడీ, సీరియస్, ట్రాజెడీ, సెంటిమెంట్ ఇలా అన్ని వేరేయషన్స్ లోను అద్భుతంగా నటించగలడు. ప్రత్యేకించి ఆయన కామెడీ టైమింగ్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. సదరు రెండు చిత్రాలు తెలుగులోకి కూడా డబ్ అవ్వడంతో తెలుగు సినీ ప్రేమికులకి కూడా సతీష్ షా సుపరిచయస్తుడే.

ఈ రోజు మధ్యాహ్నం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ముంబై(Mumbai)లోని హిందూజా ఆసుపత్రి(Hinduja Hospital)లో సతీష్ షా తుది శ్వాస విడిచారు. కొంతకాలం నుంచి మూత్ర పిండాలకి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న సతీష్ షా ఎప్పటికప్పుడు ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కిడ్నీల మార్పిడి జరిగింది. కానీ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో పాటు హార్ట్ ఎటాక్ కూడా రావడంతో మరణించడం జరిగింది. మరణం విషయాన్నీ సతీష్ షా మేనేజర్ మీడియాకి చెప్పడంతో విషయం లేట్ గా బయటకి వచ్చింది. దీంతో బాలీవుడ్ లో విషాదఛాయలు అలుముకోగా రేపు ఆదివారం అంత్యక్రియలు జరగనున్నాయి.

1973 వ సంవత్సరంలో భగవాన్ పరశురామ్ అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన సతీష్ షా 2014 వరకు తన నటనతో అభిమానులని అలరిస్తూ వచ్చాడు. సుమారు 100 చిత్రాల వరకు ఆయన ఖాతాలో ఉన్నాయి. చివరగా సిల్వర్ స్క్రీన్ పై కనపడిన చిత్రం హమ్ షకలాస్. బుల్లి తెరపై కూడా తన సత్తా చాటడంతో పాటు ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డుల్ని సైతం అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన వయసు 74 సంవత్సరాలు.


50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.