English | Telugu

ఆర‌డుగుల బుల్లెట్‌... వీడా??

ఓ పాట హిట్ట‌యితే చాలు - రిమిక్స్ చేద్దామ‌నుకొనేవాళ్లు అప్పుడు. అందులోని ప‌దాల‌తో టైటిల్ పుట్టించేద్దామ‌నుకొంటున్నారు ఇప్పుడు. అత్తారింటికి దారేది లో ఆర‌డుగుల బుల్లెట్ పాట ఎంత హిట్ట‌యిందో తెలిసిందే. ఇప్పుడు అదే సినిమా టైటిల్ అయిపోయింది. నాగబాబు త‌న‌యుడు వ‌రుణ్‌తేజ్ సినిమాకి ఆ టైటిల్ పెడ‌తార‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. వ‌రుణ్ కూడా ఆర‌డుగులు ఉంటాడు కాబ‌ట్టి.. ఆ టైటిల్ స‌రిపోయేదే. కానీ ఇప్పుడు మ‌రో ఆర‌డుగుల బుల్లెట్ బ‌య‌ట‌కు వ‌చ్చాడు. అత‌నే ...స‌ప్త‌గిరి. ఈమ‌ధ్య దూసుకొస్తున్న న‌వ‌త‌రం క‌మెడియ‌న్ల‌లో స‌ప్త‌గిరి ఒక‌డు. స‌ప్త‌గిరితో శ్రేయాస్ మీడియా ఓ సినిమా చేద్దామ‌ని ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాని ఆర‌డుగుల బుల్లెట్ అనే టైటిల్ పెట్టింద‌ని స‌మాచార‌మ్‌. అంటే స‌ప్త‌గిరి హీరోగా ప్ర‌మోట్ అవుతున్నాడ‌న్న‌మాట‌. బాగానే ఉంది వ్య‌వ‌హారం.. అయితే ఆర‌డుగుల బుల్లెట్ టైటిల్‌కీ స‌ప్త‌రిగిరీ ఏమైనా మ్యాచ్ అవుతుందా..?? బ‌హుశా టైటిల్ నుంచే కామెడీ పుట్టిద్దామ‌ని ఫిక్స‌య్యారేమో. మారుతి శిష్యుడొక‌రు ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని టాక్‌. త్వ‌ర‌లోనే పూర్తి వివ‌రాలు తెలుస్తాయి.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.