English | Telugu

సంక్రాంతికి వస్తున్నాంపై హైకోర్టులో పిల్  

విక్టరీ వెంకటేష్,అనిల్ రావిపూడి,దిల్ రాజు కాంబోలో తెరకెక్కిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి కానుకగా ఈ నెల 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని అశేష ప్రేక్షాభిమానంతో ముందుకు దూసుకుపోతుంది.ఇక కలెక్షన్స్ పరంగా చూసుకుంటే వెంకీ, అనిల్, దిల్ రాజు కెరీర్లోనే బిగ్గెట్ కలెక్షన్స్ ని సాధిస్తుంది.వారం రోజుల్లోనే 200 కోట్ల క్లబ్ లోకి చేరిందంటే 'సంక్రాంతికి వస్తున్నాం' సాధించిన ఘన విజయాన్ని అర్ధం చేసుకోవచ్చు.

లేటెస్ట్ గా ఏపీ హైకోర్టులో 'సంక్రాంతికివస్తున్నాం' పై పిల్ నమోదయ్యింది.సినిమా బడ్జెట్, కలెక్షన్ల విషయంలో క్విడ్‌ ప్రోకోకు పాల్పడ్డారు.మొదటి రోజు 6 ఆటలు ప్రదర్శించి టికెట్ రేట్స్ అధికంగా అమ్మారు.50 కోట్లు ఖర్చుతో తీసిన సినిమాకి హై బడ్జెట్ సినిమా అని చెప్పి రేట్స్ ,షోస్ ని ఎక్కువ వేశారు.కాబట్టి అదనపు షోల ద్వారా వచ్చిన ఆదాయాన్ని,ప్రభుత్వ ఖాజానాలో జమ చేసేలా ఆదేశాలు ఇవ్వాలి.ఐటీ, ఈడీతో విచారణ జరిపించాలని సదరు పిటిషనర్ తన పిల్ లో పేర్కొన్నాడు.దిల్ రాజు పై కూడా కేసు నమోదు చెయ్యడం జరిగింది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.