English | Telugu

కవర్ పేజీపై అందాల సుందరి సమంత

ప్రముఖ ఉమెన్ మేగజైన్ ‘జెఎఫ్‌డబ్ల్యూ' 7వ వార్షికోత్సవం సందర్భంగా టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతను ముఖచిత్రంగా ప్రచురించింది. అంతేకాదు.. స‌మంత‌ని ది మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఇన్ టాలీవుడ్ అంటూ వ‌ర్ణించింది. అందం, అభిన‌య‌మే కాదు.. త‌న వృత్తి ప‌ట్ల హుందాగా వ్య‌వ‌హ‌రిస్తుంది. అందిరితోనూ స‌ర‌దాగా ఉంటుంది అంటూ కొనియాడింది. వైట్ అంట్ వైట్ డ్రెస్సులో ఓ రెంజులో తన అందాలను ప్రదర్శించింది సమంత.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.