English | Telugu

అల్లరి నరేష్ ఇంట తీవ్ర విషాదం 

ప్రముఖ నటుడు అల్లరి నరేష్(Allari Naresh) ఇంట విషాదం చోటు చేసుకుంది. నరేష్ తాతయ్య, దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తండ్రి ఈదర వెంకట్రావు కన్నుమూశారు.వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో ఈరోజు(మంగళవారం) తెల్లవారుజామున మూడు గంటల సమయంలో తుది శ్వాస విడిచారు.ఆయన వయసు 90 సంవత్సరాలు.

ఈదర వెంకట్రావు సతీమణి వెంకటరత్నం 2019 మే 27న మరణించారు. వీరికి ముగ్గురు కుమారులు, ఒక కుమారై. పెద్దకుమారుడు ఈవీవీ సత్యనారాయణ, రెండో కుమారుడు ఈవీవీ గిరి, మూడో కుమారుడు ఈవీవీ శ్రీనివాస్, కుమారై ముళ్ళపూడి మంగాయమ్మ.

రెండు దశాబ్దాల సినీ ప్రయాణంలో 50కి పైగా సినిమాలు చేసి గొప్ప దర్శకులలో ఒకరిగా పేరుపొందిన ఈవీవీ సత్యనారాయణ.. అనారోగ్యంతో 2011 జనవరి 21న కన్నుమూశారు. ఆయన కుమారులు ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ నటులుగా మంచి గుర్తింపు పొందారు. ముఖ్యంగా అల్లరి నరేష్ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

ఈదర వెంకట్రావు మృతితో అల్లరి నరేష్ ఇంట విషాదం నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం కోరుమామిడిలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు వెంకట్రావు అంత్యక్రియలు జరుగనున్నాయి.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం