English | Telugu

సుప్రీంకోర్టులో మోహన్ బాబుకు ఊరట!

నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. జర్నలిస్ట్‌పై దాడి కేసులో తనను అరెస్ట్ చేయొద్దని, తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన కొన్ని రోజుల కిందట సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆయన పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు ఈ కేసులో తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు మోహన్‌బాబుపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. దీంతో మోహన్ బాబుకు భారీ ఊరట లభించినట్లైంది. (Mohan Babu)

అయితే ఈ కేసులో బెయిల్ కోసం ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ, మోహన్ బాబుకు బెయిల్ ఇచ్చేందుకు ఉన్నతన్యాయస్థానం నిరాకరించింది. దీంతో తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేశారు. తన వయస్సు 78 ఏళ్లనీ, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాననీ, కనుక తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.

ఈ పిటిషన్‌పై దేశ సర్వోన్నత న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ మోహన్ బాబుపై ఎటువంటి తొందరపాటు చర్యలూ తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు వివరాల్లోకి వెడితే.. గత నెల 10 వ తేదీన మోహన్ బాబు ఓ విలేకరిపై దాడికి పాల్పడ్డారు. దీంతో మోహన్ బాబుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.