English | Telugu

రిషబ్ శెట్టి షాకింగ్ రెమ్యూనరేషన్.. తెలుగు స్టార్స్ కంటే ఎక్కువ!

హాట్ టాపిక్ గా మారిన కాంతార హీరో రెమ్యూనరేషన్!
తెలుగు స్టార్స్ కంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న రిషబ్!

'కాంతార' సినిమాలతో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్నాడు కన్నడ స్టార్ రిషబ్ శెట్టి (Rishab Shetty). తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు మార్కెట్ ని మరింత పెంచుకునే పనిలో ఉన్న రిషబ్.. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నాడు. ఆ సినిమాల కోసం రిషబ్ అందుకుంటున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అది కొందరు తెలుగు స్టార్స్ కంటే ఎక్కువ కావడం విశేషం. (Rishab Shetty Remuneration)

కొన్నేళ్ల క్రితం వరకు కన్నడ సినిమా మార్కెట్ చాలా చిన్నది. అందుకే బడ్జెట్ లు, రెమ్యూనరేషన్ లు చాలా తక్కువగా ఉంటాయి. కేజీఎఫ్, కాంతార సినిమాల తర్వాతనే కన్నడ ఇండస్ట్రీ రేంజ్ పెరుగుతూ వస్తోంది. అయితే అక్కడ భారీ బడ్జెట్ సినిమాలు ఎక్కువగా రూ.100 కోట్లకు అటూఇటూగా తెరకెక్కుతుంటాయి. అలాంటిది ఇప్పుడు రిషబ్ శెట్టి ఒక్కో సినిమాకి రూ.80 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడన్న వార్త సంచలనంగా మారింది.

రిషబ్ శెట్టి చేతిలో రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న 'జై హనుమాన్' ఒకటి కాగా, అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న సినిమా మరొకటి. 'కాంతార-2' భారీ విజయాన్ని అందుకోవడంతో.. ఇప్పుడు రిషబ్ ఒక్కో ఫిల్మ్ కి రూ.80 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. ప్రస్తుతం రిషబ్ పాన్ ఇండియా ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఆ మొత్తం ఇవ్వడానికి నిర్మాతలు కూడా ఓకే చెప్పినట్లు టాక్. ఈ సినిమాలు కూడా హిట్ అయితే రిషబ్ రెమ్యూనరేషన్ వంద కోట్లు దాటుతుంది అనడంలో డౌట్ లేదు.

కన్నడ హీరోలలో ఇదే అత్యధిక పారితోషికం అని తెలుస్తోంది. అంతేకాదు తెలుగులోనూ ఒకరిద్దరు పాన్ ఇండియా హీరోలను తీసేస్తే.. వంద కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వారు దాదాపు లేరు. అలాంటిది ఇప్పుడు కన్నడ హీరో రిషబ్, తెలుగులో ఈ స్థాయి పారితోషికం అందుకోవడం సంచలనంగా మారింది.

Also Read: మార్కో డైరెక్టర్ తో బాలయ్య.. మాస్ సంభవం!

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం