English | Telugu

మిర్చి అంటే ప్రభాస్, ఫైర్ అంటే బాలయ్య.. పవన్ కళ్యాణ్ తో ఒక్క ఛాన్స్!

పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న రెజీనా కసాండ్రా, ప్రస్తుతం ఢీ డాన్స్ షోలో విజయ్ బిన్నీ మాస్టర్ తో పాటు కో-జడ్జిగా అలరిస్తోంది. అలాంటి రెజీనా ఒక చిట్ చాట్ షోలో చాలా విషయాలను షేర్ చేసుకుంది.

"20 ఏళ్ళ మీ సినిమా జర్నీ గురించి మీ మాటల్లో" అన్న ప్రశ్నకు.."ఓ అదొక పెద్ద స్టోరీ ఐపోతుంది. ఇదొక ఫన్, ఎక్సయిటింగ్ జర్నీ, కానీ టఫ్ గా ఉంది. చాలా మెమొరబుల్ నాకు" అంటూ ఆన్సర్ ఇచ్చింది రెజీనా. "మీ చైల్డ్ హుడ్ హీరో క్రష్ ఎవరు" అని అడగగా.. "ఐదారేళ్ళ వయసున్నప్పుడు నాకు సల్మాన్ ఖాన్ అంటే ఇష్టం అలాగే విజయ్ ఇంకా మహేష్ బాబు కూడా" అని చెప్పింది.

"కొన్ని ఐటమ్స్ నేమ్స్ చెప్తే ఏ హీరో గుర్తొస్తాడో చెప్పాలి" అనేసరికి "మిర్చి అంటే ప్రభాస్, ఫైర్ అంటే బాలయ్య" అని చెప్పింది. "చేసిన మూవీస్ లో మీ రోల్స్ నేమ్స్ చెప్పాలి" అని అడిగారు. "ఎస్ఎంఎస్ మూవీలో శృతి, పవర్ లో వైష్ణవి, పిల్లా నువ్వు లేని జీవితం మూవీలో సిరి అండ్ శైలజ" అని చెప్పింది. "ఇంకా వర్క్ చేసే ఛాన్స్ రాలేదు అనిపించే హీరోస్ ఎవరు" అనేసరికి "పవన్ కళ్యాణ్ గారు. ఆయనతో ఇప్పటి వరకు నటించలేదు" అని చెప్పింది.

"మీ ఢీ షో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది" అని అడిగేసరికి "చాల ఫ్యాబులౌస్ గా ఉంది. ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్..ఇలా ఒక డాన్స్ రియాలిటీ షోకి ఒక జడ్జ్ గా చేయడం. నాకు చిన్నప్పటినుంచి డాన్స్ అంటే ఇష్టం. చిన్నప్పుడు క్లాసెస్ కి కూడా వెళ్లేదాన్ని. భరతనాట్యం నేర్చుకున్నా. ఇక ఇక్కడ కంటెస్టెంట్స్ చేసే డాన్స్ చూసాక వాళ్ళు పెట్టే ఫోకస్ కానీ, వాళ్ళు చూపించే పవర్ కానీ నాకు బాగా నచ్చుతుంది. ఇదేమంత ఈజీ జాబ్ కాదు. ఇదొక బ్రాండ్. ఇలాంటి ఒక బ్రాండ్ ఉన్న డాన్స్ షోలో నేను ఒక భాగం కావడం సంతోషంగా ఉంది" అని చెప్పింది. "ఢీ సెట్ లో బాగా ఫన్ చేసేది ఎవరు" అని అడిగేసరికి.." అందరూ ఫన్ చేస్తారు. ఆది, విజయ్ బిన్నీ మాస్టర్, నందు, కంటెస్టెంట్స్ అంతా" అని చెప్పింది.

"మీ మూవీస్ లో ఆల్ టైం ఫేవరేట్ మూవీ ఏది" అని అడగగా.. "ఎవరు" మూవీ ఇష్టం అని చెప్పింది రెజీనా. "మీరు ఏ డైరెక్టర్ తో వర్క్ చేయాలి అనుకుంటున్నారు" అనే ప్రశ్నకు.. "మణిరత్నం గారు, రాజమౌళి గారితో వర్క్ చేయాలనీ ఉంది" అని చెప్పింది.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం