English | Telugu
చివరి సారి మనముందుకొస్తున్న 'రియల్ స్టార్'
Updated : Jun 9, 2014
సినిమా అభిమానులతో పాటు, పరిశ్రమలోనూ, ప్రజల్లోనూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న రియల్ హీరో శ్రీహరి. ఆయన మరణించడానికి ముందు నటించిన సినిమా టైటిల్ ‘రియల్ స్టార్’అని మార్చాలని ఆ చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది. గతంలో ‘టీ సమోసా బిస్కెట్’ అనే టైటిల్‌తో రూపొందించిన ఈ సినిమాకు ఇప్పుడు ‘రియల్ స్టార్’ అని మార్చారు.ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు కొండపల్లి యోగానంద్, లక్ష్మణరావులు మీడియాకు తెలియజేశారు. శ్రీహరి జీవితానికి దగ్గరగా ఉండే సినిమా కావడంతో సినిమాకు ఈ కొత్త టైటిల్ పెట్టినట్లు తెలియచేశారు. వందేమాతరం శ్రీనివాస్ సంగితం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. శ్రీహరి నటించిన ఆఖరి చిత్రానికి ‘రియల్ స్టార్’ అనే టైటిల్ పెట్టడం ఆయనకు నిజమైన నివాళి.