English | Telugu

ఏ భామ అదిరిందో చెప్పండి!

పాలరాతి శిల్పానికి చీరకట్టి సింగారిస్తే- అచ్చం శృతిలాగే ఉంటుంది
చందనపు బొమ్మలాంటి సొగసరికి గులాబీలు అద్దినట్లుండే చీర కడితే - ఇలా అనుష్కలా తళుక్కుమంటుంది
ఆశపెట్టే ఆకాశం చుక్కలను చిన్నదాని నడుముకి చుడితే - ఇదిగో ఇలా సమంతలా మెరుస్తుంది.
చూపరులను చీర కట్టుతో కట్టిపడేస్తున్న ఈ ముగ్గురి భామల్లో
ఎవరి అందం వారిది.. ఎవరి స్టైల్ వారిది.. వీరిలో ఎవరు బెస్ట్ అంటారు..
మిమ్మల్ని ఏ భామ కళ్లు తిప్పుకోకుండా చేసిందో కామెంట్ చేయండి..

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.