English | Telugu
1 నేనొక్కడినేలో ఓడిన సక్సెస్‌ఫుల్ హీరోయిన్
Updated : Jun 9, 2014
ఒక్క సినిమా ఫ్లాప్ అయితే, రెండో సినిమా అవకాశం రావడం కష్టమే. కానీ క్రితి సనన్‌కి మాత్రం తెలుగులో పరాజయం ఎదురయినా బాలీవుడ్ లో సక్సెస్ పలకరించింది. మహేష్ బాబుతో ‘1 నేనొక్కడినే’ లో కనిపించిన క్రితి సనన్ ను ఇక్కడి వాళ్లకు అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఈ పరిశ్రమ కాకపోతే పక్క పరిశ్రమ డోరు కొట్టాలి అనే సీక్రెట్ క్రితికి ముందే తెలుసు అనుకుంటా. బాలీవుడ్ కు చేరుకుంది. జాకీష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ తో కలిసి ‘హీరోపంతీ’ సినిమాలో నటించింది. ఈ మధ్యే విడుదలైన చిత్రం మంచి కలెక్షన్లు తెచ్చిపెట్టింది. దీంతో బాలీవుడ్ లో రెండు, తెలుగులో మరో సినిమా క్రితిని వెతుక్కుంటూ వెళ్లాయి. ఇంతేనా, అదృష్టం వచ్చి క్రితి మీద దాడి చేసింది అని చెప్పాలి. పెప్సి కంపెనీ క్రితిని బ్రాండ్ అంబాసిడర్ గా ఉండమని ఆఫర్ ఇచ్చింది. ఈ సాప్ట్ డ్రింక్ ల అంబాసిడర్ గా ఉండటం మాములు లక్ కాదు. అది తెలుగులో ఫెయిల్యూర్ అయిన క్రితిని అదృష్టం ఆ తర్వాత ఇన్ని రకాలుగా వరిచింది.