English | Telugu

హీరో రవితేజ తండ్రి అరెస్ట్

హీరో రవితేజ తండ్రి అరెస్ట్ అయ్యారు. వివరాల్లోకి వెళితే ప్రముఖ తెలుగు హీరో, మాస్ రాజాగా వినుతికెక్కిన రవితేజ కన్నతండ్రి భూపతి రాజు చతుర్ముఖ పారాయణం చేస్తూ, అదేనండీ పేకాట ఆడుతూ హైదరాబాద్ " గోల్డెన్ క్లబ్"లో, పోలీస్ రైడ్ లో మే 9 వ తేదీన అరెస్ట్ అయ్యారు. గతంలో రవితేజ తమ్ముళ్ళు రఘునాథ్ రాజు, భరత్ రాజులను ఇద్దర్నీ అనేక సార్లు పోలీసులు అరెస్ట్ చెయ్యటం జరిగింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కొకైన్ అనే మాదక ద్రవ్యాన్ని కొంటూ నార్కొటిక్స్ డిపార్ట్ మెంటుకి పోలీసుల అరెస్ట్ చేయ్యటం ద్వారా దొరకటం జరిగింది.

అదేంటో పాపం రవితేజ తమ్ముళ్ళను డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు "వీర" సినిమా షూటింగులో ఆగ్రాలో ఉన్నాడు. ఇప్పుడు కూడా తన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు యూరప్ లో అదే చిత్రం పాటల షూటింగ్ లో ఉన్నాడు. అప్పుడు తమ్ముళ్ళు రవితేజ పరువు గంగలో కలిపితే, ఇప్పుడు కన్నతండ్రే రవితేజ పరువును బజారుకీడ్చాడు. అసలే కష్టజీవి అయిన రవితేజ తన మానాన తాను రాత్రింబవళ్ళు సినిమాల షూటింగుల్లో యమ బిజీగా ఉంటే, అతని కుటుంబ సభ్యులే అతనికిలా మనశ్శాంతి లేకుండా చేయటం, అతని పరువు ప్రతిష్టలు దిగజార్చటం చాలా చాలా దురదృష్టకరం. అయినా ఇనుముతో కూడిన అగ్నికి కూడా సమ్మెట పోట్లు తప్పవు కదా. మీ కోసం రవితేజ తండ్రి అరెస్టయిన దృశ్యాల వీడియోని కూడా ఇస్తున్నాం.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.