English | Telugu

'రావణాసుర' ట్రైలర్ అదిరింది.. రవితేజ మరో బ్లాక్ బస్టర్ కొట్టినట్టే!

మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రావణాసుర'. అభిషేక్‌ పిక్చర్స్‌, ఆర్‌టీ టీమ్‌ వర్క్స్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో సుశాంత్, అను ఇమ్మాన్యుయేల్‌, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ కి ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది.

సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన 'రావణాసుర' ట్రైలర్ ఆకట్టుకుంటోంది. రవితేజ మార్క్ ఎంటర్ టైన్ మెంట్ తో పాటు థ్రిల్లింగ్ అంశాలతో ట్రైలర్ ను రూపొందించారు. క్రైమ్ సన్నివేశాలతో ట్రైలర్ ను ప్రారంభించి, ఆ తరువాత రవితేజను లాయర్ గా పరిచయం చేయడం ఆకట్టుకుంది. లాయర్ గా రవితేజ తన మార్క్ కామెడీతో ముగ్గురు హీరోయిన్లతో కలిసి నవ్వించాడు. లాయర్ గా, క్రిమినల్ గా రెండు విభిన్న కోణాల్లో తనదైన శైలిలో అలరించాడు. ట్రైలర్ చివరిలో సగం జోకర్ ఫేస్, సగం రవితేజ ఫేస్ తో చూపించిన షాట్ ట్రైలర్ కే హైలైట్ గా నిలిచింది. ట్రైలర్ లో "వాడు క్రిమినల్ లాయర్ కాదు.. లా చదివిన క్రిమినల్", "మర్డర్ చేయడం క్రైమ్.. దొరక్కుండా మర్డర్ చేయడం ఆర్ట్.. i am an artist" వంటి డైలాగ్ లు ఆకట్టుకున్నాయి. మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే 'ధమాకా' సక్సెస్ తో జోరు మీదున్న మాస్ రాజా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకునేలా ఉన్నాడు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.