English | Telugu

బెల్లంకొండ ప్రపంచ రికార్డు.. 'కేజీఎఫ్'ను దాటేశాడు!

ఒక్కోసారి బాక్సాఫీస్ దగ్గర కుర్ర హీరోల సినిమాలు అద్భుతాలు చేస్తుంటాయి. అయితే యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలు మాత్రం యూట్యూబ్ లో ప్రపంచ రికార్డులు సృష్టిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ లో అత్యధిక మంది వీక్షించిన సినిమా బెల్లంకొండ నటించిన చిత్రం కావడం విశేషం.

బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'జయ జానకి నాయక'(2017). ఈ సినిమాని హిందీలోకి డబ్ చేసి 2019 లో 'పెన్ మూవీస్' యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేయగా ఇప్పటిదాకా ఏకంగా 709 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీంతో యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ లో సాధించిన చిత్రంగా 'జయ జానకి నాయక' రికార్డు సృష్టించింది. 702 మిలియన్ వ్యూస్ తో ఆ తర్వాతి స్థానంలో 'కేజీఎఫ్' నిలిచింది. బెల్లంకొండ నటించిన మరో సినిమా 'సీత' హిందీ డబ్బింగ్ వెర్షన్ కి కూడా 588 మిలియన్ వ్యూస్ రావడం విశేషం.

యూట్యూబ్ లో బెల్లంకొండ హిందీ డబ్బింగ్ సినిమాలకు ఆ స్థాయి రెస్పాన్స్ రావడం చూసే ఆయనతో హిందీ సినిమా చేయాలని పెన్ మూవీస్ భావించినట్లుంది. 'ఛత్రపతి' హిందీ రీమేక్ తో త్వరలో బెల్లంకొండ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మే 12న విడుదల కానుంది. మరి యూట్యూబ్ ద్వారా నార్త్ ఆడియన్స్ కి దగ్గరైన బెల్లంకొండ.. థియేటర్లలోనూ ఆదరణ పొందుతాడేమో చూడాలి.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.