English | Telugu

రష్మిక చేతుల్లో కాంతార భవిష్యత్తు.. భారీ నష్టం తప్పదా..?

ఒక్కోసారి కొన్ని సినిమాల రిజల్ట్ ఇతర చిత్రాలపైనో లేదా ఆ సినిమాలతో సంబంధం లేని స్టార్స్ పైనో ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు 'కాంతార చాప్టర్ 1' భవిష్యత్తు కూడా రష్మికా మందన్న చేతుల్లో ఉందన్న ఆసక్తికర చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతోంది. (Rashmika Mandanna)

నిజానికి కన్నడ భామ రష్మికపై కన్నడ ఫ్యాన్స్ కాస్త కోపంగా ఉన్నారు. దానికి కారణం.. 'కాంతార చాప్టర్ 1' రిలీజ్ టైంలో ఎందరో స్టార్స్ విష్ చేస్తే.. రష్మిక మాత్రం విష్ చేయలేదు. దాంతో ఆమెపై కన్నడ ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. అలాంటిది ఇప్పుడు ఆమె చేతుల్లోనే 'కాంతార చాప్టర్ 1' భవిష్యత్ ఉందనే చర్చ ఆసక్తికరంగా మారింది. (Kantara Chapter 1)

దసరా కానుకగా అక్టోబర్ 2న విడుదలైన 'కాంతార చాప్టర్ 1' ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రూ.700 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. అందులో కన్నడ గ్రాస్ రూ.200 కోట్లు అయితే.. దానికి మించేలా హిందీ గ్రాస్ రూ.200 కోట్లకు పైగా వచ్చింది. మూడో వారంలోనూ హిందీ గడ్డ మీద 'కాంతార' బాగానే రన్ అవుతోంది. ఇలాంటి సమయంలో రష్మిక రూపంలో 'కాంతార' జోరుకి బ్రేకులు పడే అవకాశం కనిపిస్తోంది.

రష్మిక ప్రధాన పోషించిన హిందీ చిత్రం 'థామా' నేడు(అక్టోబర్ 21) థియేటర్లలో అడుగుపెట్టింది. మ్యాడాక్‌ హారర్ కామెడీ యూనివర్స్ నుంచి 'స్త్రీ-2' వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన సినిమా కావడంతో 'థామా'పై మొదటి నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే.. అడ్వాన్స్ బుకింగ్స్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక విడుదల తర్వాత ఈ సినిమాకి హిందీ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. దీంతో బుకింగ్స్ ఊపందుకున్నాయి. ఒక్క బుక్ మై షోలోనే గంటకు 30 వేలకు పైగా టికెట్లు బుక్ అవుతున్నాయి. (Thamma Movie)

'థామా' సినిమా ఇదే జోరు కొనసాగిస్తే.. 'కాంతార చాప్టర్ 1' హిందీ రన్ ఇక ముగిసినట్లే. అసలు ఇప్పుడు 'థామా' విడుదల కాకపోయినా లేదా పాజిటివ్ టాక్ రాకపోయినా.. హిందీలో 'కాంతార' మరో రూ.30 కోట్ల దాకా రాబట్టేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి రష్మిక సినిమా దెబ్బకు హిందీలో కాంతారకు భారీగానే నష్టం జరుగుతోందని అంటున్నారు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం