English | Telugu

ఆ హీరోల కొత్త సినిమాల రేంజ్ లో 'బాహుబలి' రీ రిలీజ్ బిజినెస్!

రీ రిలీజ్ సినిమాలు రూ.10 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తేనే గొప్ప. అలాంటిది, రీ రిలీజ్ అవుతున్న ఓ మూవీ.. తెలుగు రాష్ట్రాల్లోనే ఏకంగా రూ.30 కోట్లకు పైగా బిజినెస్ చేస్తే?. ఇప్పుడు 'బాహుబలి' అలాంటి ఫీట్ నే సాధించింది. (Baahubali: The Epic)

'బాహుబలి' సినిమా రెండు భాగాలను కలిపి, ఒక భాగంగా 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 31న విడుదల కానున్న 'బాహుబలి: ది ఎపిక్' కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ట్రేడ్ వర్గాలు కూడా ఈ మూవీ రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబడుతుందని అంచనా వేస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే బిజినెస్ కూడా భారీగా జరుగుతోంది.

నైజాంలో రూ.17 కోట్లు, సీడెడ్ లో రూ.4.5 కోట్లు, ఆంధ్రాలో రూ.15 కోట్లు చొప్పున.. తెలుగు రాష్ట్రాల్లో 'బాహుబలి: ది ఎపిక్' ఏకంగా రూ.36.5 కోట్ల బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. అంటే బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.37 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉంది.

సాధారణంగా నాని, విజయ్ దేవరకొండ వంటి యంగ్ స్టార్ల కొత్త సినిమాలు.. తెలుగు స్టేట్స్ లో ఈ రేంజ్ బిజినెస్ చేస్తుంటాయి. అలాంటిది, ఒక రీ రిలీజ్ మూవీ.. ఈ రేంజ్ బిజినెస్ చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. అయితే 'బాహుబలి' కాబట్టే ఇది సాధ్యమైందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

'బాహుబలి: ది ఎపిక్'కి సంబంధించిన బిజినెస్ లెక్కలు వింటుంటే.. ఈ సినిమా 100 కోట్లు కాదు, 200 కోట్ల గ్రాస్ రాబట్టినా ఆశ్చర్యంలేదు అనిపిస్తోంది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.