English | Telugu

రానా పెళ్లికీ - అనుష్క పెళ్లికీ లింకేంటి?

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్ ఇద్ద‌రూ బాహుబ‌లిలోనే ఉన్నారు. రానా, ప్ర‌భాస్ కి ఇంకా పెళ్లి కాలేదు. బాహుబ‌లి త‌ర‌వాత ప్ర‌భాస్ పెళ్లి జ‌ర‌గ‌డం ఖాయ‌మైపోయింది. ఇక రానా వంతు. రానా వెండితెర‌పై యాక్ష‌న్ యోధుడిలా క‌నిపిస్తాడు గానీ.. బ‌య‌ట మ‌హా రొమాంటిక్‌. బిపాసాబ‌సు, త్రిష‌ల‌తో రానాకి ఎఫైర్లు ఉన్నాయ‌ని రూమ‌ర్లు న‌డిచాయి. ఇక బాహుబ‌లి లో క‌థానాయిక‌గా న‌టిస్తున్న అనుష్క పెళ్లిపైనా బోలెడ‌న్ని రూమ‌ర్లు. మ‌రి ప్ర‌భాస్, రానా, అనుష్క ఈ ముగ్గురూ ఎప్పుడు పెళ్లి చేసుకొంటారు..?? బాహుబ‌లి ట్రైల‌ర్ విడుద‌ల సందర్భంగా ప్ర‌బాస్‌, రానా, అనుష్క‌, త‌మ‌న్నాల మ‌ధ్య స్మాల్ చిట్ చాట్ జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా పెళ్లి ప్ర‌స్తావ‌న కూడా వ‌చ్చింది. 'మంచి ముహూర్తం కుద‌ర‌నివ్వండి పెళ్లి చేసుకొంటా..' అని ప్ర‌భాస్ స‌మాధానం చెబితే... అనుష్క మాత్రం వెరైటీగా 'రానాకి పెళ్ల‌య్యాకే నేను పెళ్లి చేసుకొంటా' అంది. దాంతో రానా కాస్త షాక్ అయ్యాడు. వెంట‌నే తేరుకొని 'నన్నెవ‌రు పెళ్లి చేసుకొంటారండీ..' అంటూ కామెంట్ చేశాడు. మొత్తానికి పెళ్లి విష‌యమై రానా, అనుష్క‌, ప్ర‌భాస్‌ల మ‌న‌సులో ఏమ‌నుకొంటున్నారో.. అర్థ‌మైపోయింది.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.