English | Telugu

కదిలే దేవత అమ్మ

అమ్మ.. రెండక్షరాల ఈ పదం.. ఆత్మీయానురాగాల సంగమం. జీవం పుట్టుకకు ఆధారం. జాతికి చైతన్యం అందించడంలో ఆమెదే పై స్థానం. అందుకే అన్నాడు ఓ సినీకవి... 'జన్మంటూ ఉంటే నీకే పుడతానే... ధన్మోస్మి అంటూ దండంపెడతానే' అని. మదర్స్ డే సందర్భంగా మీకు శుభాకాంక్షలు చెబుతోంది మీ తెలుగువన్. ఈ సందర్భంగా లేటెస్ట్ గా తెరపై వెలుగుతున్న అందమైన అమ్మలపై స్పెషల్ మీకోసం.

ఎక్కువ మందికి చేరువయ్యే సినిమాలో అమ్మపాత్రకు లభించే ఆదరణ అంతాఇంతా కాదు. అందుకే దర్శకనిర్మతలు సైతం అమ్మ పాత్రలు మంచి ప్రాధాన్యతే ఇస్తారు. అయితే గతంలో అమ్మలు అంటే ముసలైపోయి, భర్త చనిపోయి, పెద్ద తరహాలో కనిపించేవారు. నిర్మలమ్మ, అన్నపూర్ణ..ఇలాంటి వారంతా ఈ కోవకు చెందినవారే. ఆ తర్వాత సుధ, ప్రగతి, లక్ష్మి..ఇలా చాలామంది ఉన్నారు. అయితే రాన్రానూ ట్రెండ్ మారుతోంది. సినిమాలో హీరోయిన్ ఎవరన్న విషయంపై ప్రేక్షకులు ఎంత శ్రద్ధ పెడుతున్నారో...అమ్మ పాత్రపై కూడా అంతే శ్రద్ధ పెడుతున్నారు. అందుకే లేటస్ట్ మూవీస్ లో అమ్మలు అందంగా కనిపిస్తున్నారు. అందమైన ఆంటీలనే అమ్మలుగా ఎంపిక చేస్తున్నారు.



ప్రస్తుతం టాలీవుడ్ ని ఊపేస్తున్న నదియా విషయానికొస్తే......ఆరడుగుల అందగాడైన ప్రబాస్ కి తల్లిగా కనిపించి అమ్మబాబోయ్ అనిపించింది. మిర్చిలో అనుష్క కన్నా నదియా గ్లామర్ గా ఉందన్న విషయం అంగీకరించాల్సిందే. ఆ సినిమాలో నదియా అందానికి ఫిదా అయిపోయిన త్రివిక్రమ్ అత్తారింటికి దారేది లో తీసుకున్నాడు. సమంత, ప్రణీతకు తల్లిగా నదియా అదిరింది.



అందమైన అమ్మల లిస్ట్ లో ఎప్పటి నుంచో ఇప్పటికీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది జయసుధ. హీరోయిన్ గా చాలాకాలం వెలుగు వెలిగిన జయసుధ అమ్మగా అలరిస్తోంది. 'అమ్మానాన్న ఓ తమిళమ్మాయి', 'బొమ్మరిల్లు', 'కొత్త బంగారులోకం', 'ఎవడు' సహా పలుచిత్రాల్లో అమ్మ పాత్రలో ఆకట్టుకుంది. కేవలం అందమైన అమ్మగానే కాకుండా తన పాత్రకు ప్రాముఖ్యత ఉండేలా చూసుకుంటోంది. తల్లిగా జయసుధని ఇష్టపడని వారు లేరంటే అతిశయోక్తి కానేకాదు. జయసుధ తర్వాత ప్లేస్ లో ఉంటుంది సుహాసిని. అమ్మ చెప్పింది', 'గబ్బర్ సింగ్' లాంటి ఎన్నో చిత్రాలలో అమ్మగా నటించి ఆ పాత్రకు మరింత ఔన్నత్యాన్ని అందించింది. హీరోయిన్ గా వెలుగుతున్నప్పుడే లాలిపాటలు పాడిన రాధిక....అమ్మ పాత్రలుకు సైతం పూర్తిస్థాయి న్యాయం చేసింది. అరేబియన్ హార్స్ నగ్మా విషయానికొస్తే అమ్మడు ఏ డ్రస్ వేసినా అదుర్సే. ఇప్పటికీ నగ్మాలో ఛార్మ్ ఏమాత్రం తగ్గలేదు. అందుకే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అల్లరిరాముడులో చూస్తే ఎన్టీఆర్ సరసన హీరోయినా? అన్నట్టు కనిపించింది.



విరిసినది వసంతగానం అంటూ చల్లనిగాలితో చక్కిలిగింతలు పెట్టిన రోజా సైతం....అమ్మగా మంచి మార్కులే వేయించుకుంది. 'గోలీమార్', 'మొగుడు', 'కోడిపుంజు' లాంటి సినిమాల్లో తల్లి పాత్రలు చేసింది. తన నాట్యంతో ఆకాశంలో ఆశలహరివిల్లు చూపించిన భానుప్రియ ప్రభాస్ కి తల్లిగా ఛత్రపతిలో మెప్పించింది. దేవత నుంచి దయ్యం వరకూ పల్లెటూరి పిల్ల నుంచి బికినీ వేసే భామ వరకూ ఏ పాత్రకైనా పూర్తిస్థాయి న్యాయం చేసే తార ఎవరంటే ముందుగా గుర్తొస్తుంది రమ్యకృష్ణ. హీరోయిన్ గానే కాదు కొంచెంఇష్టం కొంచెంకష్టంలో అమ్మగా నటించి హీరోయిన్స్ తో సమానంగా పోటీపడింది. ఇప్పుడు బాహుబలిలో శివగామిగా ఆకట్టుకోనుంది.

'నానీ' లో మహేశ్ బాబుకు అమ్మగా దేవయాని చక్కగా ఉందనిపించింది. లాంగ్ గ్యాప్ తర్వాత ఎంట్రీ ఇచ్చిన అమల సైతం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో అమ్మగా మెరిసింది. పరువం వానగా అంటూ మురిపించిన మధుబాల ..'అంతకుముందు ఆ తరువాత' లో సుమంత్ అశ్విన్ కు తల్లి పాత్రలో ఒదిగిపోయింది. బాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపుఊపిన భామలు 'కాజోల్', మాధురీ దీక్షిత్, జూహీచావ్లా, రవీనా టాండన్, కరిష్మాకపూర్...చివరికి శ్రీదేవి సహా అంతా సినిమాల్లో అమ్మగా మెప్పిస్తూనే అడపాదడపా ప్రకటనల్లోనూ తళుక్కుమంటున్నారు. నీ నవ్వే చాలు చామంతి పూబంతి అంటూ ఆడిపాడిన సుకన్య సైతం ఇప్పుడు అమ్మపాత్రలో అలరించనుందంటున్నారు.

ఇక్కడి విశేషమేంటంటే....ముద్దుగుమ్మలు హాట్ హాట్ గా కనిపించినప్పుడు ఎంజాయ్ చేసే ప్రేక్షకులు...అదే తార అమ్మగా టర్న్ అయ్యాక చాలా గౌరవంగా చూస్తున్నారు. గత చరిత్ర వదిలేసి ప్రస్తుతం ఏ మేరకు ఆకట్టుకుంటున్నారు అనే విషయంపైనే చర్చించుకుంటున్నారు. ఏదేమైనా హీరోహీరోయిన్స్ తో పాటూ...తల్లి పాత్రల్లో మెరుస్తున్న ముద్దుగుమ్మలకు సైతం మార్కులేస్తున్నారు. ఎన్ని అభిరుచులు మారినా అమ్మ అమ్మే. అందుకే అంటారు పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ...కదిలే దేవత అమ్మ...కంటికి వెలుగమ్మా అని.....

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.