English | Telugu

వర్మ పట్టపగలు ఫస్ట్ లుక్

రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం "పట్టపగలు". రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుగుతున్నాయి. ఇటీవలే వర్మ తీసిన "రౌడీ" మంచి టాక్ ను సొంతం చేసుకోవడంతో... ఇదే సమయంలో తన మరో చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేసి జనాల్లో అంచనాలను పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే "పట్టపగలు" ఫస్ట్ లుక్ ను తాజాగా విడుదల చేసారు. కూతురుని పట్టి పీడిస్తున్న క్షుద్ర శక్తులతో ఒక తండ్రి ఎలా పోరాడాడు? దానికోసం అతను ఏం చేసాడు? అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కినట్లు తెలుస్తోంది. సినిమాను మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.