English | Telugu

సూపర్ స్టార్ రజనీ కాంత్ కి స్వల్ప అస్వస్థత

సూపర్ స్టార్ రజనీ కాంత్ కి స్వల్ప అస్వస్థత కలిగింది. వివరాల్లోకి వెళితే సౌతిండియన్ సినిమా స్టామినాని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్ళిన సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "రాణా" కోసం ఎ.వి.యమ్ స్టుడియోకి వెళ్ళారు. ఆ సినిమా ప్రారంభోత్సవం కాగానే ఆయనకు కడుపునొప్పి రావటంతో ఆయన్ని వేంటనే చెన్నై మైలాపూర్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడ ఆయనకు ఒక సిలైన్ ఎక్కించి, రక్తపోటు వంటి కొన్ని రొటీన్ పరీక్షలు చేశారు. అనంతరం రజనీకాంత్ ఆరోగ్యానికి ఏం భయం లేదనీ, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందనీ, కాకపోతే ఆయన్ని కొన్నిరోజులు విశ్రాంతి తీసుకోవలసిందిగా డాక్టర్లు సూచనలిచ్చారు.

రజనీకాంత్ హీరోగా నటిస్తున్న"రాణా" చిత్రానికి కె.యస్.రవికుమార్ దర్శకులుగా, ఎఅ.ఆర్.రెహమాన్ సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. రజనీకాంత్ "రాణా" చిత్రంలో రజనీ కాంత్ త్రిపాత్రాభినయం చేస్తూండగా దీపిక పదుకునే, ఇలియానా, విద్యాబాలన్ లు వంటి ప్రముఖ నటీమణులు హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.