English | Telugu

టెంప‌ర్‌కి ద‌ర్శ‌కేంద్రుడి కితాబు


టెంప‌ర్‌కి పాజిటీవ్ టాక్ వ‌స్తోంది. అభిమానులు కొత్త ఉత్సాహంతో కేరింత‌లు కొడుతున్నారు. సినీ ప్ర‌ముఖులు కూడా టెంప‌ర్ పై పాజిటీవ్ గా స్పందిస్తున్నారు. రాజ‌మౌళి, పూరి, వ‌ర్మ‌.. వీళ్లంతా బెనిఫిట్ షోలో సంద‌డి చేశారు. ఆ త‌ర‌వాత‌ ఒకొక్క‌రూ టెంప‌ర్ ఫీవ‌ర్‌లో మునుగుతూ... టెంప‌ర్ సూప‌ర్ హిట్‌.. హిట్ అంటూ ట్విట్ట‌ర్ల‌లో త‌మ స్పంద‌న‌ను పంచుకొంటున్నారు. తాజాగా ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు కూడా టెంప‌ర్ సూప‌ర్ హిట్ అంటున్నారు. ఆయ‌న సినీ మాక్స్‌లో ప్ర‌త్యేకంగా టెంప‌ర్‌ని వీక్షించారు. అనంత‌రం ఫేస్ బుక్‌లో త‌న స్పంద‌న పంచుకొన్నారు. ''టెంప‌ర్ చూశాను. తార‌క్ న‌ట‌న అద్భుతంగా ఉంది. ప‌రిశ్ర‌మ‌లో తానెంత గొప్ప న‌టుడో మ‌రోసారి నిరూపిత‌మైంది. స్ర్కీన్ ప్లే చాలా గ్రిప్పింగ్‌గా ఉంది. సెకండాఫ్ లోని ఎమోష‌న్లు చాలా గ్రిప్పింగ్ గా సాగాయి. పూరి, తార‌క్‌ల‌కు గొప్ప కమ్‌బ్యాక్ సినిమా ఇది''r అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.