English | Telugu
బాలయ్య రేటు 20 కోట్లు!
Updated : Feb 17, 2023
టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లు అందించిన స్టార్ హీరోలు పారితోషకాలను బాగా పెంచేస్తున్నారు. ఇది ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు అదే తరహాలో టాలీవుడ్ అగ్ర కదా నాయకుడు బాలకృష్ణ తన రెమ్యూనేషన్ భారీగా పెంచేశారు. 2021 వరకు టాప్ హీరో అయిన నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ ని ఫ్లాప్ లను ఎదుర్కొన్నారు. అయితే బోయపాటి శ్రీను తో చేసిన అఖండతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేసారు. 2021 డిసెంబర్ లో విడుదలైన ఈ మూవీ 50% ఆక్యుపెన్సిలోనూ బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేసింది. బాలయ్య పవర్ఫుల్ పాత్రలో నటించిన ఈ చిత్రం తిరుగులేని విజయాన్ని అందించింది. బాలయ్య సత్తా ఏమిటో మరోసారి నిరూపించింది.
ఈ మూవీకి బాలయ్య 12కోట్ల పారితోషకం తీసుకున్నారు. బాలకృష్ణ ఆ మూవీ అందించిన సక్సెస్ తో తాజాగా వీరసింహారెడ్డి చేశాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను అత్యంత ప్రతిషాత్మకంగా నిర్మించారు. సంక్రాంతి బరిలో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద 80 కోట్ల వరకు రాబట్టింది. ఇతర రైట్స్ కూడా బాగా భారీ దరనే సొంతం చేసుకున్నాయి. ఓవరాల్ గా ఈ మూవీ 120 కోట్లు రాబట్టిందట. ఈ సినిమాకి బాలయ్య 15 కోట్లు మాత్రమే డిమాండ్ చేసి ఆ మొత్తం అందిపుచ్చుకున్నారని అంటున్నారు.
బాలకృష్ణ తాజా చిత్రాలకు మాత్రం 20 కోట్లు అడుగుతున్నారట. మేకర్స్ కూడా తాజాగా విడుదలైన వీర సింహారెడ్డి వసూళ్లను బట్టి బాలకృష్ణకు 20 కోట్లు ఇస్తామంటూ వెంటపడుతున్నారు. బాలయ్య కూడా మొత్తం ఇస్తేనే సినిమా అంటూ పారితోషికం విషయంలో ఎక్కడా తగ్గడం లేదని ఇండస్ట్రీలో వినిపిస్తుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య తన 108వ సినిమా చేస్తున్నారు. ఈ మూవీని సాహు గారపాటి హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. బాలయ్యకు కూతురుగా శ్రీలీలా నటిస్తోంది. ఈ మూవీ తరువాత ఆయన చేయనున్న సినిమాకు 20 కోట్లు డిమాండ్ చేస్తుండడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.