English | Telugu

ఏప్రిల్ 17న రేసుగుర్రం సక్సెస్ మీట్

అల్లు అర్జున్, శృతిహాసన్ జంటగా నటించిన "రేసుగుర్రం" ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని దక్కించుకుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ, రికార్డులను బ్రేక్ చేస్తుంది. అయితే ఈ సక్సెస్ ను ప్రేక్షకులతో పంచుకోవడానికి ఓ భారీ సక్సెస్ మీట్ ను ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్ 17న ఈ కార్యక్రమం జరగనుందని తెలిసింది. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు, హీరో హీరోయిన్లు, సంగీత దర్శకుడు, నిర్మాతలతో పాటుగా మరికొంతమంది ముఖ్య తారాగణం పాల్గొననుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని మలయాళంలో కూడా విడుదల చేయనున్నారు.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.