English | Telugu
మాజీ బాయ్ ఫ్రెండ్‌కు ప్రియాంక నోటీసులు
Updated : Jun 3, 2014
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తన మాజీ బాయ్ ఫ్రెండ్ అసీమ్ మర్చంట్, మేనేజర్ ప్రకాష్ జాజుకు లీగల్ నోటీసులు పంపించింది.
ప్రియాంక మేనేజర్‌గా వ్యవహరించిన ప్రకాష్ జాజు జీవితం ఆధారంగా అసీమ్ మర్చంట్ ఒక సినిమా తీసెందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాలో ప్రియాంక తన గురించిన, తన కుటుంబం గురించిన విషయాలు ఏమైనా ఉంటాయేమో అని అభ్యంతరం చెప్తూ నోటీసులు పంపింది.
ఈ సినిమాలో తన క్లయింటుకు సంబంధించిన విషయాలు ఉన్నాయని వార్తలు బయటకు వచ్చాయని, అలా అయితే, దాని వలన తన క్లయింటు హక్కులకు భంగం కలుగుతుందని ఆ విషయాన్నే నోటీసులో పేర్కొన్నట్లు ఆమె తరపు న్యాయవాది ఆనంద్ దేశాయ్ వివరించారు.
ఈ విషయం మాటల ద్వారా కాకుండా నోటీసుల వరకు వెళ్లడానికి కారణం జాజు, చోప్రా మధ్య ఉన్న విభేదాలే కావచ్చు. ప్రియాంక తనకు ఇవ్వాల్సిన డబ్బు తిరిగి ఇచ్చేందుకు నిరాకరిస్తోందని గతంలో ప్రకాష్ జాజూ ఆరోపించారు. ఆ సమయంలో ప్రియాంక తండ్రి అశోక్ చోప్రా జాజుపై కేసు ఫైల్ చేశారు. దీంతో జాజు రెండు నెలలకు పైగా జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఈ తతంగం అక్కడితో ముగిసిందనుకున్న ప్రియాంకకు ఇప్పుడు తాజాగా జాజూపై చిత్ర నిర్మాణం జరుగుతుందనే విషయం బాగా ఇబ్బంది పెడుతోంది. తన కుటుంబం గురించిన వివరాలు ఈ సినిమాలో ప్రస్తావించడం పై ప్రియాంక అందుకే అభ్యంతరం తెలిపింది. పైగా ఈ చిత్రాన్ని ఆమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నిర్మిస్తుండటం ఆమెను మరింత ఆలోచనలో పడేస్తోంది. వారిద్దరికీ ఈ విషయంలో నోటీసులు పంపింది ప్రియాంక.