English | Telugu
"రుషి" ఫిబ్రవరి 10 న విడుదల
Updated : Feb 2, 2012
"రుషి" ఫిబ్రవరి 10 న విడుదల కానుంది. వివరాల్లోకి వెళితే ప్రతిష్టాత్మక ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై, "ఇట్స్ మై లవ్ స్టోరీ" ఫేం అరవింద్ కృష్ణ హీరోగా, సుప్రియ శైలజ హీరోయిన్ గా, రాజ్ మాదిరాజు దర్శకత్వంలో, ప్రసాద్ ల్యాబ్ అధినేత రమేష్ ప్రసాద్ నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం "రుషి". ఈ "రుషి" చిత్రానికి స్నిగ్ధ, డాన్ - చంద్రన్ అనే ముగ్గురు తొలిసారిగా సంగీతాన్ని అందించటం విశేషం. ఈ చిత్రం ఆడియో ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంలో మొత్తం పదకొండు పాటలున్నాయి.
ఫిబ్రవరి 2 వ తేదీన హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లోఈ చిత్రం ఓ ప్రెస్ మీట్ ఏర్పాటుచేసింది. ఈ పాత్రికేయుల సమావేశంలో ఈ చిత్ర నిర్మాత రమేష్ ప్రసాద్ ప్రసంగిస్తూ తమ సంస్థ సినిమాలు తీయటం ఆపాసిన తర్వాత మళ్ళీ నిర్మిస్తున్న చిత్రం ఈ "రుషి" అనీ, ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ నచ్చే విధంగా ఉంటుందనీ, తమ చిత్రాన్ని ఫిబ్రవరి 10 వ తేదీన విడుదల చేయనున్నామని ఆయన అన్నారు.