English | Telugu

మా ఫిలిం స్కూల్ కి హెడ్ ప్రకాష్ రాజ్- నాగ్

మా ఫిలిం స్కూల్ కి హెడ్ ప్రకాష్ రాజ్ అని యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున అన్నారు. వివరాల్లోకి వెళితే ఒకప్పుడు తాను సినిమాల్లోకి వచ్చినప్పుడు సరైన గైడ్ లైన్స్ లేక తాను ఎంతగా ఇబ్బంది పడ్డారో తెలిసిన నటసామ్రాట్, పద్మవిభూషణ్, డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు ఆ ఇబ్బంది ఇంకెవరికీ కలుగకుండా ఉండేందుకు గాను సినీ పరిశ్రమకు సంబంధించిన అన్ని విభాగాల్లోనూ శిక్షణనిచ్చే ఒక స్కూల్ ను ప్రారంభించారు.

ఆ స్కూల్ కు నటన విభాగానికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంటుగా ప్రముఖ విలక్షణబహుభాషా నటుడు, జాతీయ అవార్డు గ్రహీత అయిన ప్రకాష్ రాజ్ వ్యవహరిస్తారనీ,అలగే ప్రముఖ దర్శకులు మణిరత్నం, ప్రముఖ నర్తకి, నటి అయిన శోభన, ప్రముఖ నటి రేవతి అలాగే అనీల్ మెహతాలు కన్సల్టింగ్ మెంబర్లుగా వ్యవహరిస్తారనీ కూడా నాగార్జిన మీడియాకు తెలియజేశారు. ఈ స్కూల్ ని ప్రతిఫలాపేక్ష లేకుండా సినిమా మీద ప్యాజన్ తో వచ్చే వారికి మార్గదర్శకంగా ఉంటూ, వారికి ఆసక్తి ఉన్న విభాగంలో శిక్షణ ఇచ్చే విధంగా ఉండేలా స్థాపించామనీ ఆయన అన్నారు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.