English | Telugu

డిసెంబర్ లో ప్రభాస్ మ్యారేజ్..!!

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ మ్యారేజ్ పై గత కొంతకాలంగా ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. ఈ సంవత్సరం ప్రభాస్ పెళ్ళి చేసుకోవడం ఖాయమని అంటున్నారు. పశ్చిమ గోదావరి భీమవరం కి చెందిన చుట్టాల అమ్మాయికి ప్రభాస్ ఒకే చెప్పాడని, అన్నీ అనుకున్నట్టుగా జరిగితే డిసెంబర్‌లో వివాహం జరగడం ఖాయమంటున్నారు. గతంలో పెదనాన్న పెళ్లి వారితో సంప్రదింపులు జరుపుతున్నారని ప్రభాస్ ను మీడియా వారు ప్రశ్నించగా వాటిని ఆయన ఖండించకపోగా, కాస్త నవ్వుతూ సైలెంట్‌గా వెళ్ళిపోయారు. దీంతో ప్రభాస్ మ్యారేజ్ పై సస్పెన్స్ కొనసాగుతూనే వుంది.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.