English | Telugu

Maa Oori Polimera Day 1 Collections: పొలిమేర 2  ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్

సత్యం రాజేష్ హీరో గా అనిల్ విశ్వనాధ్ దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా పొలిమేర 2 . పొలిమేర సినిమా ఘన విజయంతో పొలిమేర 2 మీద కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఏర్పడ్డాయి.నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ అందరి అంచనాలని అందుకొని మంచి ఓపెనింగ్స్ ని రాబట్టింది.
పొలిమేర 2 ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన అన్ని కేంద్రాల్లో కూడా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. నిన్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 3 .5 కోట్ల గ్రాస్ ని సాధించింది. ఆంధ్రలో 73 లక్షలు, నైజాం లో 78 లక్షలు, కర్ణాటక,రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్ సీస్ ల్లో 32 లక్షల సాధించి టోటల్ 1 .83 కోట్ల రూపాయిల షేర్ ని కూడా సాధించింది. పొలిమేర 2 లో సత్యం రాజేష్,సాహితి దాసరి, బాలాదిత్య ,గెటప్ శ్రీను, రవి వర్మ తదితరులు నటించారు. గౌరీ కృష్ణ నిర్మాతగా వ్యవహరించాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం