English | Telugu

ఈ నెల 12 న ఢిల్లీకి రామ్ చరణ్.. అసలు తగ్గేదేలే  

గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్'(Ram Charan)ప్రస్తుతం స్పోర్ట్స్ అండ్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న 'పెద్ది'(Peddi)మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నో భారీ అంచనాలతో వచ్చిన 'గేమ్ చేంజర్' డిజాస్టర్ గా నిలవడంతో, చరణ్ తో పాటు మెగా అభిమానుల ఆశలన్నీ 'పెద్ది' పైనే ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్, చరణ్ గెటప్ తో అందరిలో 'పెద్ది' పై పాజిటివ్ వైబ్రేషన్ ఏర్పడ్డాయి. చరణ్ చెప్పిన డైలాగులు కూడా, సినిమాపై అంచనాలు పెంచడంతో పాటు, సోషల్ మీడియా వేదికగా నేషనల్ లెవల్లో హల్ చల్ చేస్తున్నాయి. దీంతో పెద్ది' గ్యారంటీ హిట్ అనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. చరణ్ సరసన జాన్వీకపూర్(janhvi kapoor)హీరోయిన్ గా చేస్తుంది.

శరవేగంగా చిత్రీకరణని పూర్తి చేసుకుంటున్న 'పెద్ది' ఇటీవలే ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ని పూర్తి చేసుకుంది. దీంతో తమ తదుపరి షెడ్యూల్ ని ఢిల్లీలో జరుపుకోవడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. ఈ నెల 12 నుంచి ప్రారంభంకానున్న ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు, చరణ్, జాన్వీలపై రొమాంటిక్ సన్నివేశాలని చిత్రీకరించబోతున్నారు. రెండు సాంగ్స్ ని కూడా ఈ షెడ్యూల్ లోనే ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. రొమాంటిక్ సన్నివేశాలతో పాటు, సాంగ్స్ సినిమాలో హైలెట్ గా ఉండబోతున్నాయని ఒక సరికొత్త చరణ్ ని అభిమానులు చూడబోతున్నారని కూడా తెలుస్తుంది. ఇక ఈ షెడ్యూల్ తో సినిమా సగ భాగం కంప్లీట్ అయినట్టే అని, మిగతా షెడ్యూల్ ని కూడా ఆగస్టు కి పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కి వెళ్లాలని యూనిట్ అనుకుంటుంది.

మెగా అభిమానులకి, ప్రేక్షకులకి ఈ సారి 'పెద్ది' రూపంలో మెమొరీబల్ హిట్ ఇవ్వాలని, ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers)భావిస్తుంది. చరణ్, మైత్రి కాంబోలో ఇప్పటికే వచ్చిన రంగస్థలం ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో తెలిసిన విషయమే. దీంతో అంతకు మించి హిట్ ఇవ్వాలనే పట్టుదలతో మైత్రి సంస్థ ఉంది. వృద్ధి సినిమాస్, సుకుమార్(Sukumar)రైటింగ్స్ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యమయ్యారు. 'పెద్ది' లో చరణ్ పలురకాల గేమ్స్ లో ప్రావిణ్యం పొందిన అటగాడిగా కనిపిస్తున్నాడు. ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు(Buchibabu)దర్శకుడు కాగా శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేన్దు శర్మ తదితరులు ముఖ్య పాత్రలో కనిపిస్తున్నారు. ఏ ఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. 2026 మార్చి 27 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.



బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం