English | Telugu

మళ్లీ వార్త‌ల్లోకి 'కోబ‌లి'

అత్తారింటికి దారేది త‌ర‌వాత ప‌వ‌న్ క‌ల్యాణ్ - త్రివిక్ర‌మ్ ల క‌ల‌యిక మ‌ళ్లీ చూసే అవ‌కాశం ద‌క్క‌నుందా?? వీళ్లిద్దరూ హ్యాట్రిక్ కొట్ట‌బోతున్నారా?? ఔన‌నే అంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు. ప‌వ‌న్, త్రివిక్ర‌మ్‌ల క‌ల‌ల చిత్రం కోబ‌లి త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ్లే అవ‌కాశాలున్నాయి. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో కోబ‌లి సెట్స్‌పైకి వెళ్ల‌డం ఖాయం అనిపిస్తోంది. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి త‌ర‌వాత త్రివిక్ర‌మ్ మ‌హేష్ బాబుతోఓ సినిమా చేయాల్సివుంది. అయితే మ‌హేష్‌.. బ్ర‌హ్మోత్స‌వం సినిమాతో బిజీ అయిపోయాడు. మ‌రోవైపు గ‌బ్బ‌ర్ సింగ్ 2 ఇంకా ప‌ట్టాలెక్క‌లేదు. ఆ ప్రాజెక్టు ఇంకా స్ర్కిప్టు ద‌శ‌లో ఉంది. అటు బ్ర‌హ్మోత్స‌వం, ఇటు గ‌బ్బ‌ర్ సింగ్ 2 స్ర్కిప్టు పూర్త‌య్యేలోగా... ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్‌లు క‌ల‌సి కోబ‌లిని పూర్తి చేసే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్ ఇద్ద‌రూ మంచి స్నేహితులు. దానికి తోడు హిట్ కాంబినేష‌న్. `కోబ‌లి` సినిమా ప‌వ‌న్‌తో తీస్తా.. అని ఇది వ‌ర‌కు త్రివిక్ర‌మ్ ప్ర‌క‌టించాడు కూడా. సో... కోబ‌లి మ‌ళ్లీ వార్త‌ల్లోకి వ‌చ్చింది. ఈ సినిమా ప‌ట్టాలెక్క‌డానికి ఇదే స‌రైన స‌మ‌యం. త్వ‌ర‌లోనే ఇందుకు సంబంధించిన ఓ శుభ‌వార్త వినొచ్చు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.