English | Telugu

పవన్ మూడో పెళ్లి ఆగస్టులోనే అయ్యిందట...!

పవన్ కళ్యాణ్ కు నందినితో మొదటి పెళ్లి జరిగింది. ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి, హీరోయిన్ రేణుకా దేశాయ్ ను రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే గతకొద్దికాలంగా రేణుతో కూడా పవన్ దూరంగా ఉంటున్నాడు. అయితే కొన్నిరోజులుగా పవన్ మూడో పెళ్లి చేసుకున్నాడని వార్తలు వస్తున్నాయి.

"తీన్ మార్" చిత్రంలో రెండో హీరోయిన్ గా నటించిన అన్నాలెజినోవా అలియాస్ డానాతో పవన్ ప్రేమాయనం సాగిస్తున్నాడు. తాజాగా వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారని సాక్షాలు కూడా దొరికాయి.

హైదరాబాద్ ఎర్రగడ్డ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆగష్టు 30న పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. పవన్, డానాలు ఇద్దరు కలిసి రిజిస్టర్ మ్యారేజ్ కు అప్లై చేసారని, వీరు అప్లై చేసిన తర్వాత నోటిస్ బోర్డులో కూడా అధికారులు పెట్టినప్పటికీ కూడా..ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో నెలరోజుల సర్టిఫికెట్ జారీ చేసినట్లు అధికారి తెలిపినట్లు సమాచారం.

వీరిద్దరి పెళ్ళికి ముగ్గురు సాక్షులు సంతకాలు పెట్టారని, ఈ పెళ్లి కోసం డానా తన పాస్ పోర్ట్ జిరాక్స్ కాపీని ఆధారంగా పెట్టినట్లు తెలిసింది. ప్రస్తుతం వీరిద్దరికీ ఓ పాప కూడా ఉన్నట్లు సమాచారం. కానీ ఇంత జరుగుతున్న కూడా పవన్ ఏ విధంగా కూడా స్పందించకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.