English | Telugu

సారీ చెప్పించుకున్నావు ఇప్పుడు హ్యాపీనా?

తిరుపతి లడ్డు కల్తీ విషయంలో పవన్ కళ్యాణ్(pawan kalyan)ప్రకాష్ రాజ్(prakash raj)ల మధ్య చిన్నపాటి వార్ లాంటిది జరుగుతున్న విషయం తెలిసిందే.తిరుపతి లడ్డు కల్తీ విషయాన్నీ పెద్దది చెయ్యద్దని పవన్ ని ఉద్దేశించి ప్రకాష్ రాజ్ ట్వీట్ చెయ్యడం, సెక్యూరలిజం అంటే అన్ని మతాలని గౌరవంగా చూడటం,అయినా ప్రకాష్ రాజ్ కి ఏంటి సంబంధం ఏంటని పవన్ కళ్యాణ్ బహిరంగంగా చెప్పడం జరిగాయి.

రీసెంట్ గా ప్రకాష్ రాజ్ తన ట్విటర్ వేదికగా చెయ్యని తప్పుకు సారీ చెప్పించుకోవడంలో ఉన్న ఆనందమేంటో, జస్ట్ ఆస్కింగ్ అంటు ట్వీట్ చేసాడు. అందులో పవన్ పేరుని ప్రస్తావించకపోయినా,పవన్ ని ఉద్దేశించే చేసాడనే విషయం అందరకి అర్ధమవుతుంది.ఎందుకంటే ప్రముఖ తమిళ నటుడు కార్తీ రీసెంట్ గా ఒక సినిమా ఫంక్షన్ లో లడ్డు అంశం చాలా సున్నితమైందని నవ్వుతు చెప్పడంపై పవన్ తన అసంతృప్తి వ్యక్తం చేసాడు.దీంతో తన తప్పుని గ్రహించిన కార్తీ వెంటనే పవన్ కళ్యాణ్ కి క్షమాపణలు చెప్పాడు.ఈ విషయంపైనే ప్రకాష్ రాజ్ తాజా ట్వీట్ అనే సంగతి అర్ధం అవుతూనే ఉంది.దీంతో పవన్, ప్రకాష్ రాజ్ మ్యాటర్ మున్ముందు ఎన్నెన్ని మలుపులు తీసుకుంటుందో అనే అభిప్రాయం అందరిలో వ్యక్తం అవుతుంది.

పవన్ నా మాటలని అపార్ధం చేసుకున్నాడు.ఒక సినిమా షూటింగ్ నిమిత్తం విదేశాల్లో ఉన్నాను.ఈ నెల ముప్పై న ఇండియా వచ్చి పవన్ కళ్యాణ్ ప్రశ్నలకి సమాధానం చెప్తాను. కావాలంటే నా ట్వీట్ ని మళ్ళీ ఇంకోసారి చదువుకోండంటూ తన స్పీచ్ తో కూడిన ఒక వీడియోని కూడా ప్రకాష్ రాజ్ రిలీజ్ చేసాడు.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.