English | Telugu

మ్యూజిక్ డైరెక్టర్ గా పవర్ స్టార్ తనయుడు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే 19 ఏళ్ళ అకీరా నందన్ మాత్రం హీరోగా కాకుండా, సంగీత దర్శకుడిగా అవతారమెత్తి సర్ ప్రైజ్ చేశాడు.

'రైటర్స్ బ్లాక్' అనే షార్ట్ ఫిల్మ్ కి అకీరా సంగీతం అందించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన హీరో అడివి శేష్.. షార్ట్ ఫిల్మ్ లింక్ షేర్ చేసి, టీంకి విషెస్ చెప్పాడు. రాసేటప్పుడు రచయిత మెదడులో ఓ చిన్నపాటి యుద్ధం చేస్తాడు అని తెలిపేలా ఉన్న ఈ షార్ట్ ఫిల్మ్ కి కార్తికేయ యార్లగడ్డ దర్శకత్వం వహించాడు. 4 నిమిషాల 34 సెకన్ల నిడివి గల ఈ చిత్రానికి అకీరా అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. మరి భవిష్యత్తులో అకీరా అడుగులు సంగీతం దిశగా పడతాయో లేక పవర్ స్టార్ అభిమానుల కోరిక మేరకు హీరోగా ఎంట్రీ ఇస్తాడో చూడాలి.