English | Telugu
తన సినిమా పేరు మరచిన పవన్ కళ్యాణ్
Updated : Oct 25, 2023
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాలు, మరో వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళుతున్నారు. దసరా పండుగ సందర్భంగా ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సినీ ఇండస్ట్రీపై ఉన్న పొలిటికల్ ఇష్యూస్ గురించి స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ మధ్య జరిగిన రాజకీయ పరిణామాలపై ఆయన స్పందిస్తూ ఎందుకు సినీ పరిశ్రమ రెస్పాండ్ కాలేదని చాలా మంది అన్నారు. ప్రపంచంలో జరిగే ప్రతీ విషయంపై చిత్ర పరిశ్రమ అభిప్రాయం కావాలని అందరూ కోరుకుంటుంటారు కానీ, అదంత సులభం కాదు. సినిమా పరిశ్రమలో ఉన్నవారు కళాకారులే తప్ప రాజకీయ నాయకులు కారని చెప్పిన పవన్ కళ్యాణ్, గూడవల్లి రామబ్రహ్మం, రఘపతి వెంకయ్య నాయుడు వంటి వారి ప్రతిభ గురించి బయటివారు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఎంటర్‌టైన్‌మెంట్ అనేది జీవితంలో చాలా ముఖ్యమైంది. అది లేకుండా జీవితం లేదన్నారు పవన్ కళ్యాణ్. రజనీకాంత్‌లాంటి వారు స్పందిస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయని ఈ సందర్భంగా పవన్ పేర్కొన్నారు. ఇదే సందర్భంలో పవన్ తన సినిమాల గురించి మాట్లాడుతూ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో చేస్తున్న ఉస్తాద్ భగత్‌సింగ్ పేరుని మరచిపోయారు. సర్దార్ అని అంటూ మాట్లాడారు. అయితే పక్కనున్నవారు దాన్ని కరెక్ట్ చేయటంతో మరోసారి ఆ పేరుని కరెక్ట్‌గా పలికారు.
ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే..హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో పాటు సుజిత్ దర్శకత్వంలో ఓజీ అనే సినిమాను పూర్తి చేస్తున్నారు. దీనికి డివివి దానయ్య నిర్మాత. ఈ రెండు చిత్రాలు వచ్చే ఏడాదిలో విడుదలవుతాయని సమాచారం. ఇవి కాకుండా క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాను పవన్ పూర్తి చేయాల్సి ఉంది. రీసెంట్‌గా తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌తో కలిసి బ్రో అనే సినిమాలో ఆయన నటించిన సంగతి తెలిసిందే.