English | Telugu

సురేష్‌బాబు చేతుల మీదుగా 'పతంగ్‌' చిత్రం నుంచి 'ఎమోసనల్‌ డ్రామా' లిరికల్‌ వీడియో విడుదల

న్యూ టాలెంట్‌ను ఎంకరైజ్‌ చేయడంలో ఎప్పుడూ ముందుండే సురేష్‌ ప్రొడక్షన్స్‌ అధినేత, ప్రముఖ నిర్మాత డి.సురేష్‌ బాబు తాజాగా 'పతంగ్‌' చిత్ర టీమ్‌తో చేతులు కలిపారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ డి.సురేష్‌ బాబు సమర్పణలో ఈ చిత్రం డిసెంబరు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవల ఈ చిత్రంను ప్రత్యేక్షంగా వీక్షించి, చిత్ర టీమ్‌ను ప్రశంసించిన ఆయన 'పతంగ్‌' చిత్రాన్ని సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై తన సమర్పణలో చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

ప‌తంగుల పోటీతో రాబోతున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘ప‌తంగ్’. సినిమాటిక్ ఎలిమెంట్స్, రిష‌న్ సినిమాస్, మాన్‌సూన్‌ టేల్స్‌ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజ‌య్ శేఖ‌ర్ అన్నే, సంప‌త్ మ‌క, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మాతలు. ప్ర‌ణీత్ ప్ర‌త్తిపాటి ద‌ర్శ‌కుడు. ఈ చిత్రంలో ఇన్‌స్టాగ్రమ్ సెన్సేష‌న్ ప్రీతి ప‌గ‌డాల‌, జీ స‌రిగ‌మ‌ప ర‌న్న‌ర‌ప్ ప్ర‌ణ‌వ్ కౌశిక్‌తో పాటు వంశీ పూజిత్ ముఖ్య‌తార‌లుగా న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ సింగ‌ర్, న‌టుడు ఎస్‌పీ చ‌ర‌ణ్ ఈ చిత్రంలో కీల‌క‌మైన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌, డి.సురేష్‌ బాబు సమర్పణలో ఈ చిత్రం డిసెంబరు 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా ఈ చిత్రంలోని 'ఎమోసనల్‌ డ్రామా' అంటూ కొనసాగే ఓ మాసివ్‌ పాటను చిత్ర సమర్పకుడు సురేష్‌బాబు విడుదల చేశారు. శుక్రవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఈ పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా సురేష్‌బాబు మాట్లాడుతూ ''కొత్తతరం అంతా కలిసి ఈ సినిమా చేశారు. ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎంతో రిచ్‌గా చేశారు. నాని బండ్రెడ్డి మంచి క్రియేటివిటి ఉన్న పర్సన్‌. కెమెరా వర్క్‌ అన్ని బాగున్నాయి. ఈ సినిమా కోసం ఎంతో ఖర్చు పెట్టి క్లైమాక్స్‌ను షూట్‌ చేశారు. ఓ స్టేడియంను తీసుకుని, పతంగుల పోటీ పెట్టి ఎంతో భారీగా ఆ పతాక సన్నివేశాలు తీశారు. సినిమా తప్పకుండా అందరికి నచ్చుతుంది. తప్పకుండా ఈ సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది" అన్నారు.

నిర్మాతల్లో ఒకరైన నాని బండ్రెడ్డి మాట్లాడుతూ ''సినిమాను, నన్ను నమ్మి సురేష్‌బాబు గారు ఈ సినిమాకు సమర్పకునిగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు నా కృతజ్ఞతలు. కొత్త కాన్సెప్ట్‌తో చేసిన ఈ సినిమా అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది" అన్నారు.

సంగీత దర్శకుడు జోస్‌ జిమ్మి మాట్లాడుతూ ''సురేష్‌ బాబు గారి చేతుల మీదుగా సాంగ్‌ విడుదల కావడం ఆనందంగా ఉంది. నేను పుట్టింది కేరళలో అయినా పెరిగింది భీమవరంలో. నా పాటలు, సినిమా అందరికి నచ్చుతుందని నమ్మకం ఉంది."అన్నారు.

పూజిత్‌ మాట్లాడుతూ ''ఈ సినిమాలో ప్రతి సాంగ్‌ అందరిలో హుషారు తెప్పించే విధంగా ఉంటుంది. ఈ పాటలు నా మ్యూజికల్‌ టేస్ట్‌ను మార్చేశాయి. తప్పకుండా ఇలాంటి ఓ బ్యూటిఫుల్‌ చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నారు" అన్నారు.

ప్రణవ్‌ కౌశిక్‌ మాట్లాడుతూ ''మా చిన్న సినిమాను అందరూ సపొర్ట్‌ చేయాలి. సినిమాపై మంచి నమ్మకం ఉంది. అందరం కొత్తవాళ్లమే. కష్టపడి ఓ మంచి సినిమాను పెద్దగా తీశాం. సురేష్‌బాబు గారు యాడ్‌ అవ్వడంతో ఈ సినిమా రేంజ్‌ మారిపోయింది. మా సినిమాపై ఉన్న టెన్షన్‌ అంతా పోయింది. ఎమోసనల్‌ డ్రామా అనే సాంగ్‌ ఎంతో మాసివ్‌గా ఉంటుంది. జోస్‌ జిమ్మీ పాటలు అందరికి నచ్చుతాయి. శ్రీమణి సాంగ్‌ లిరిక్స్‌ కూడా ఆకట్టుకుంటాయి. ఆర్టిస్టులతో పాటు టెక్నిషియన్స్‌ కూడా ఎంతో కష్టపడ్డారు. అందరికి ఈ సినిమా మంచి సక్సెస్‌ను ఇస్తుందని ఆశిస్తున్నాను" అన్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ "మా సినిమా సురేష్‌బాబు గారి సమర్పణలో రిలీజ్‌ కానుండటం ఆనందంగా ఉంది. ఈ సినిమా థియేటర్‌లో యూత్‌ ఫెస్టివల్‌లా వుంటుంది. కొత్త‌వాళ్ల‌తో చేసిన మా సినిమా కొత్త‌గా వుండ‌టంతో పాటు చాలా పెద్ద సినిమా క్వాలిటీతో వుంటుంది. ఎంతో కలర్‌ఫుల్‌గా ఉండే ఈ సినిమాకు క‌థే హీరో. ఈ చిత్రానికి జోస్ జిమ్మి అద్భుత‌మైన పాట‌లు ఇచ్చాడు. పాట వింటూంటే అంద‌రిలో పాజిటివ్ వైబ్స్ క‌లుగుతాయి. సినిమా చూస్తున్నంత సేపు ఆ పంతగుల పోటీ మీలో ఉత్సుకతను కలిగిస్తుంది. త‌ప్ప‌కుండా మా ప‌తంగ్ చిత్రం అన్నివ‌ర్గాల వారిని అల‌రిస్తుంద‌నే న‌మ్మ‌కం వుంది. కొత్త కంటెంట్‌ను ఆదరించే తెలుగు ప్రేక్షకులు మా ప్రయత్నాన్ని తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం వుంది. డిసెంబరు 25న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం" అని తెలిపారు.