English | Telugu

ఆదాశ‌ర్మ ముందే కూసింది....

లేడీ ఓరియెంటెడ్ పాత్ర‌లంటే క‌థానాయిక‌ల‌కు ఎంత మ‌క్కువో. ఒక్క‌సారైనా సినిమా అంతా త‌మ భుజాల‌పై వేసుకొని లాగించేయాల‌ని ముచ్చ‌ట‌ప‌డిపోతుంటారు. అయితే.. హీరోయిన్ గా, గ్లామ‌ర్ తార‌గా నిరూపించుకొన్నాకే - ఆ తర‌హా క్యారెక్ట‌ర్లు వ‌స్తుంటాయి. కానీ ఆదాశ‌ర్మ‌కి ఈ అవ‌కాశం కాస్త ముందే వ‌చ్చింది. హార్ట్ ఎటాక్ సినిమాతో ఆక‌ట్టుకొంది ఆదా. ఇప్పుడు బ‌న్నీ - త్రివిక్ర‌మ్ సినిమాలో న‌టిస్తోంది. ఆ త‌ర‌వాత ఆదాకి ఓ పెద్ద నిర్మాణ సంస్థ నుంచి పిలుపు వ‌చ్చింది. లేడీ ఓరియెంటెడ్ సినిమా వ‌రించింది. పీవీపీ సంస్థ ఆదాశ‌ర్మ‌తో ఓ సినిమా తెర‌కెక్కిస్తోంది. ఇది లేడీ ఓరియెంటెడ్ సినిమా. ఇప్ప‌టికే ఆదాతో సంప్ర‌దింపులు జ‌రిపి, సంత‌కాలు కూడా పెట్టించేసుకొంది. గ్లామ‌ర్ పాత్ర‌లు చేయాల్సిన ఏజ్‌లో లేడీ ఓరియెంటెడ్ పాత్ర‌లేంటి?? అని ఆలోచించ‌కుండా అడిగిన వెంట‌నే ఒప్పేసుకొంది ఆదాశ‌ర్మ‌. త్రివిక్ర‌మ్ సినిమా షెడ్యూల్ పూర్త‌వ్వ‌గానే పీవీపీ సినిమా మొద‌లైపోతుంది. మ‌రి ద‌ర్శ‌కుడు ఎవ‌రు?? ఆదాశ‌ర్మ పాత్రేంటి?? అనే విష‌యాలు త్వ‌ర‌లో తెలుస్తాయి. అన్న‌ట్టు ఈసినిమాని తెలుగు, త‌మిళ భాష‌లతో పాటు హిందీలోనూ విడుద‌ల చేస్తార‌ట‌.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.