English | Telugu

'ఒక లైలా కోసం' కథేంటి..!

నాగ చైతన్య, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం 'ఒక‌లైలా కోసం'. గుండెజారి గ‌ల్లంత‌య్యిందే లాంటి సూపర్ హిట్ లవ్ స్టొరీ తరువాత విజ‌య్‌కుమార్ కొండా తీసినసినిమా ఇదే కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే వున్నాయి. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ఈ సినిమా స్టొరీ ఎలా వుండబోతుందో చూద్దాం.

ఇదో రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌. భిన్న‌దృవాలు ప్రేమించుకొంటే ఎలా ఉంటుంద‌న్న పాయింట్‌తో సాగే ప్రేమ‌క‌థ‌. ఓ మొండి అమ్మాయిని త‌న వైపుకు ఓ అబ్బాయి ఎలా తిప్పుకొన్న‌డ‌న్న నేప‌థ్యంలో సాగుతుంది. ఓ అబ్బాయి, తాను ప్రేమించిన అమ్మాయికి ఎవ‌రూ ఇవ్వ‌లేని గిఫ్ట్ ఇస్తాడు. అదేంట‌న్న‌దే ఈ క‌థ‌. ఇంట్ర‌వెల్ వ‌ర‌కూ స‌ర‌దాగా సాగిపోతుంద‌ట‌. అక్క‌డి నుంచి క‌థ‌లో మ‌లుపులు, ఎమోష‌న్స్‌, సెంటిమెంట్స్ యాడ్ అవుతూ వెళ్తాయి. ఎమోష‌న్స్ క్లైమాక్స్‌లో పీక్ అవుతాయ‌ట‌. మొత్తానికి ఓ ఫీల్ గుడ్ సినిమా తీశామ‌ని చిత్ర‌బృందం చెబుతోంది. అనూప్ స్వ‌రాలు అందించారు. ఒక‌లైలా కోసం తిరిగాను దేశం పాట‌ని ఈ సినిమా కోసం రీమిక్స్ చేశారు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.