English | Telugu

గోపిచంద్ 'జిల్' 'జిల్'

టాలీవుడ్ లో కొంతకాలంగా కష్టకాలాన్ని ఎదుర్కొన్న గోపిచంద్ 'లౌక్యం'తో ఒక్కసారిగా ప్రేక్షకుల్ని న‌వ్వుల్లో ముంచెత్తి హిట్ కొట్టాడు. లేటెస్ట్ గా అభిమానులను 'జిల్' అనిపించడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. గోపీచంద్ క‌థానాయ‌కుడిగా యువి క్రియేష‌న్స్ సంస్థ ఓ చిత్రాన్ని తెర‌కెక్కిస్తో౦ది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ దాదాపు 70 శాతం పూర్తయింది. ఏంతో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సాగిపోయే ఈ సినిమాకి 'జిల్' అనే పేరును పరిశీలిస్తున్నారట. 'ఊహలు గుసగుసలాడే' ఫేం రాశీ ఖ‌న్నా క‌థానాయికిగా నటిస్తున్న ఈ చిత్రానికి చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి శిష్య‌డు రాధాకృష్ణ‌ డైరెక్టర్. 2015 జ‌న‌వ‌రిలో ఈ సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.