English | Telugu

అభిమానుల ఆశ నెరవేరనట్టేనా! 

మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr),బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్(Hrithik Roshan)ల అప్ కమింగ్ మూవీ 'వార్ 2'(War 2)ఈ నెల 14 న వరల్డ్ వైడ్ గా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిన్న హైదరాబాద్ వేదికగా అభిమానులు, సినీ ప్రముఖుల మధ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. వార్ 2 ఘన విజయం సాధించి ఈ ఏడాది 'హృతిక్ రామారావు నామ సంవత్సరంగా మారనుందని, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ చెప్పారంటే, వార్ 2 పై ఇండస్ట్రీలో, అభిమానుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.

ఈ ఈవెంట్ లో 'ఎన్టీఆర్' మాట్లాడుతు ఎన్ని సంవత్సరాలు, యుగాలు దాటినా మరువలేని పేరు విశ్వ విఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారకరామారావు. ఆయన ఆశీస్సులు నాపై ఉన్నంత కాలం నన్ను ఎవరు ఆపలేరని చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో కొంత మంది అభిమానులు ఎన్టీఆర్ ని ఉద్దేశించి 'సిఎం' అని అరవడం జరిగింది. అనంతరం ఎన్టీఆర్
స్పందిస్తు 'మీ ప్రేమకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.ఈ జీవితం మీకే అంకితం. ఇంత కంటే శక్తీ ఏది అవసరం లేదు. ఈ జన్మకి ఈ ప్రేమ చాలు. జీవితాంతం మిమ్మల్ని సంతోషపెడుతు నా అడుగులు ముందుకు వెళ్తాయి. మిమ్మల్ని బాధపెట్టడానికి నా అడుగులు ఉండవని చెప్పాడు.

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించి ఉన్నత శిఖరాలని అందుకోవాలని చాలా మంది అభిమానులు ఎప్పట్నుంచో కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన వీడియోస్ చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ స్పీచ్ తో పాలిటిక్స్ లోకి రాడనే అభిప్రాయాన్ని కొంత మంది సినీ, రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఫంక్షన్ ముగిసాక కూడా కొంత మంది అభిమానులు మాట్లాడుతు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ స్పీచ్ వైరల్ గా మారింది. ఇక వార్ 2 లో కియారా అద్వానీ(Kaira adwani)హీరోయిన్ కాగా ఆమె ఇటీవల ఒక బిడ్డకి జన్మనివ్వడంతో ఈవెంట్ లో పాల్గొనలేకపోయింది. యష్ రాజ్ ఫిల్మ్స్, సుమారు 400 కోట్ల బడ్జెట్ తో వార్ 2 ని నిర్మించింది. అయన్ ముఖర్జీ(Ayan mukerji)దర్శకుడు.


బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం