English | Telugu

స్టార్ హీరోకి గాయాలు..ఎన్టీఆర్ సినిమా వాయిదా పడనుందా! 

మాన్ ఆఫ్ మాసెస్ 'ఎన్టీఆర్'(Ntr)వార్ 2(War 2)తో తొలిసారి బాలీవుడ్ లో అడుగుపెడుతున్న విషయం తెలిసిందే.స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithk Roshan)తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటుండ డంతో,ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై మోస్ట్ ప్రెస్టేజియస్ట్ మల్టిస్టారర్ గా వార్ 2 నిలిచింది.దీన్నిబట్టి పాన్ ఇండియా లెవల్లో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు.ముంబై లో వేసిన ఒక భారీ సెట్ లో ఎన్టీఆర్,హృతిక్ తో పాటు 500 మంది డాన్సర్స్ పై ఒక భారీ సాంగ్ ని చిత్రీకరించబోతున్నట్టుగా కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి.

అందుకు సంబంధించి రిహార్సల్స్ జరుగుతుండగా హృతిక్ కి గాయాలవడంతో,నెల రోజుల పాటు డాక్టర్స్ రెస్ట్ తీసుకోమన్నారని,దీంతో సాంగ్ వాయిదా పడిందనే న్యూస్ బాలీవుడ్ సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.మరి ఇదే నిజమైతే కనుక, అగస్టు 14 న మూవీ రిలీజ్ కావడం కష్టమనే అభిప్రాయం కూడా సినీ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.అయితే హృతిక్ గాయం గురించి చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికార ప్రకటన రాలేదు.

నిజానికి వార్ 2 స్టార్ట్ అయినప్పట్నుంచి నేటి వరకు కూడా చిత్ర బృందం అధికారకంగా ఏ విషయాన్నీ వెల్లడి చెయ్యటం లేదు.కనీసం ఎన్టీఆర్,హృతిక్ స్టిల్స్ కూడా బయటకు వచ్చిన దాఖలాలు లేవు. వార్ 2 ని అగ్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ సుమారు 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా,అయాన్ ముఖర్జీ(Ayan Mukerji)దర్శకత్వం వహిస్తున్నాడు. కియారా అద్వానీ, జాన్ అబ్రహం కీలక పాత్రలో కనిపించబోతున్నారు.ఎన్టీఆర్ నుంచి దేవర తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోయే మూవీ అయితే వార్ 2 నే.2019 లో హృతిక్, టైగర్ ష్రఫ్ కలిసి నటించిన వార్ మూవీకి సిక్వెల్ గా వార్ 2 తెరకెక్కుతుంది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.