English | Telugu

భార్యతో సహా సినిమా మధ్యలోనే వెళ్లిపోయిన కిరణ్ అబ్బవరం..అసలు నిజం ఇదే 

'క' లాంటి విభిన్న జోనర్ తో కూడిన మూవీతో హిట్ ట్రాక్ లో వచ్చిన 'కిరణ్ అబ్బవరం'(Kiran Abbavaram)ఈ నెల 14 న 'దిల్ రుబా'(DilRuba)అనే లవ్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 'రుక్సర్ థ్రిల్లన్(Ruxar Thillan)'హీరోయిన్ గా చేస్తుండగా 'విశ్వకిరణ్'(Viswa Kiran)దర్శకత్వం వహించనున్నాడు. శివమ్ సెల్ల్యులాయిడ్స్, మరో రెండు సంస్థలతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తుంది.

రీసెంట్ గా కిరణ్ అబ్బవరం ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు నా భార్య ప్రెగ్నెసీ గా ఉన్నప్పుడు మలయాళ మూవీ 'మార్కో'(Marco)కి వెళ్ళాం.అందులోని హింసకి నా భార్య చాలా అసౌకర్యంగా ఫీల్ అయ్యింది.దాంతో సెకండ్ ఆఫ్ కంప్లీట్ అవ్వకుండానే,థియేటర్ నుంచి బయటకి వచ్చేశామని చెప్పాడు.ప్రముఖ హీరోయిన్ 'రహస్య గోరఖ్' ని కిరణ్ అబ్బవరం పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.ఈ ఇద్దరు కలిసి తమ మొదటి మూవీ 'రాజావారు రాణివారు' లో కలిసి నటించే సమయంలో ప్రేమలో పడటంతో పెళ్లి చేసుకున్నారు.

కిరణ్ చెప్పిన 'మార్కో' మూవీ 2024 డిసెంబర్ 20 న విడుదలవ్వగా జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్(Ntr)సోదరుడుగా చేసిన'ఉన్ని ముకుందన్(Unni Mukundan)'మార్కో గా చాలా పవర్ ఫుల్ గా చేసాడు. మూవీలోని సీన్స్ అన్ని ఎక్కువభాగం చాలా హింసాత్మకంగా ఉండటమే కాకుండా, మలయాళ చిత్ర సీమలోనే అత్యంత హింసాత్మక చిత్రంగా కూడా 'మార్కో' ని సినీ ట్రేడ్ వర్గాలు పేర్కొంటాయి.సిద్దికీ, కబీర్ సింగ్, జగదీష్ ముఖ్య పాత్రలు పోషించాగా హనీఫ్(Hanif)దర్శకత్వాన్ని వహించాడు.30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా 155 కోట్లు దాకా రాబట్టింది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.