English | Telugu

బీచ్‌లో తాగి గొడ‌వ చేసిన నిత్య‌మీన‌న్‌

నిత్య‌మీన‌న్‌... ఎంత ప‌ద్ధ‌తైన పిల్ల‌. తెర‌పై నిండుగా న‌వ్వుతూ క‌నిపిస్తుంది. క‌ళ్ల‌తోనే క‌వ్విస్తుంది. మంచి పాత్ర ప‌డితే.. అందులో విజృంభిస్తుంది. ఈ ద‌శాబ్ద‌పు సావిత్రి అనిపించుకొంది. అవార్డుల‌తో పాటు ప్రేక్ష‌కుల మ‌న‌సుల్నీ గెలుచుకొంది. ఆమెలోనూ ఓ తింగ‌రి పిల్ల ఉంది. ఆమెలోనూ ఆధునిక భావాలున్న ఈత‌రం ఆడ‌పిల్ల ఉంది. కిక్ ఎక్కితే నిత్య కూడా ర‌చ్చ ర‌చ్చ చేస్తుంది. ఈ విష‌యం ఇటీవ‌లే బ‌య‌ట ప‌డింది. నిత్య‌మీన‌న్ క‌థానాయికగా న‌టించిన చిత్రం మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రానీ రోజు. ఈ సినిమా షూటింగ్ వైజాగ్‌లో జ‌రిగింది. విశాఖ బీచ్ అంటే నిత్య‌కి బాగా ఇష్ట‌మ‌ట‌. అందుకే ఎక్కువ స‌మ‌యం బీచ్‌లోనే గ‌డిపేద‌ట‌. ఓరోజు అర్థ‌రాత్రి ఒంట‌రిగా బీచ్‌కి వెళ్తాన‌ని గొడ‌వ చేసింద‌ట‌. యూనిట్ స‌భ్యులు కంగారు ప‌డి `ఈ టైమ్ లో అదీ ఒంట‌రిగా బీచ్‌కి వెళ్ల‌డం మంచిది కాదు` అని హిత‌బోధ చేశార‌ట‌. కానీ.. నిత్య ప‌ట్టించుకోలేద‌ట‌. ఎందుకైనా మంచిద‌ని శ‌ర్వానంద్ నిత్య‌కి తోడుగా వెళ్లాడ‌ట‌. బీచ్ లో రెండింటివ‌ర‌కూ నిత్య అల్ల‌రి చేసింద‌ట‌. అటువైపుగా వెళ్తున్న పెట్రోలింగ్ పోలీసులు నిత్య‌ని చూసి ` ఈ టైమ్‌లో ఇక్క‌డ ఉండ‌డం మంచిది కాదు.. వెళ్లిపోండి` అని సుతిమెత్త‌గా హెచ్చ‌రించి పంపించేశార‌ట‌. ఆ స‌మ‌యానికి నిత్య‌మీన‌న్ మందుకొట్టి ఉంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచార‌మ్‌. పైకి క‌నిపించ‌దు గానీ.. నిత్య‌లో ఇంత మేట‌రుందా..?? హ‌త‌విధీ...!!

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.