English | Telugu

'గబ్బర్ సింగ్ 2' లో పులి పాప సాంగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పులి చిత్రం ద్వార టాలీవుడ్ కి పరిచయమైన నికీషా ప‌టేల్ కి ఆ తరువాత చెప్పుకోద‌గిన ఆఫ‌ర్లు రాలేదు. కానీ ఆ తరువాత కొన్ని సినిమాల్లో ఐటెం సాంగ్ చేసే అవకాశాలు వచ్చిన ఒప్పుకోలేదు. అయితే కొద్ది రోజుల క్రితం ఈ ముద్దుగుమ్మ ఓ స్టేట్ మెంట్ ఇచ్చింది.'నేను ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాల్లో అయితేనే ఐటెమ్ సాంగ్ చేస్తా.. వేరే సినిమాల్లో చేయను'' అని సూటిగా చెప్పింది. మరి ఈ విషయం పవన్ కు తెలిసిందో లేక అనుకోకుండా జరిగిందో కానీ ఈ అమ్మడుకి పవన్ గబ్బర్ సింగ్ 2 లో ఐటెం సాంగ్ చేసే అవకాశం వచ్చిందట. అలాగే గబ్బర్ సింగ్ లో గాయ‌త్రి రావు చేసిన హార‌తి పాత్ర ఈ అమ్మడు చేత చేయించాలని చిత్ర‌బృందం భావిస్తున్న‌ట్టు స‌మాచారం.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.