English | Telugu

అమితాబ్‌ కోలుకుంటున్నారు.. ఇప్పట్లో 'ప్రాజెక్ట్ కె' సెట్స్ కి రారు!

అమితాబ్‌ బచ్చన్‌ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. మార్చిలో ఆయన ప్రాజెక్ట్ కె సెట్స్ లో గాయపడిన విషయం తెలిసిందే. ప్రభాస్‌, దీపిక పదుకోన్‌ జంటగా నటిస్తున్న సినిమా ప్రాజెక్ట్ కె. ఈ చిత్రంలో దిశా పాట్ని మరో హీరోయిన్‌గా నటిస్తున్నారు. కీలక పాత్రలో అమితాబ్‌ నటిస్తున్నారు. ఫ్యూచరిస్టిక్‌ వరల్డ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రం కోసం స్పెషల్‌ వెహికల్స్ కూడా సిద్ధం చేయిస్తున్నారు చిత్ర దర్శకుడు నాగ్‌ అశ్విన్.

వైజయంతీ సంస్థ నిర్మిస్తున్న చిత్రమిది. ఈ సినిమా సెట్స్ లోనే మార్చిలో గాయపడ్డారు అమితాబ్‌ బచ్చన్‌. యాక్షన్‌ సీన్‌ తెరకెక్కిస్తుండగా పక్కటెముకలకు గాయాలైంది. ఇక్కడ హైదరాబాద్‌లో చికిత్స తీసుకుని ముంబైకి చేరుకున్నారు అమితాబ్‌. ప్రస్తుతం ఆయన కాస్త కోలుకుంటున్నారు. ఆ మధ్య సెట్స్ కి వెళ్తున్నట్టు మెసేజ్‌ పెట్టినా, ఇంకా ప్రాజెక్ట్ కె సెట్స్ లో మాత్రం అడుగుపెట్టలేదు. ''త్వరలోనే షూటింగ్‌కి జాయిన్‌ కావాలనుకుంటున్నారు బిగ్‌ బీ. కాకపోతే గాయాలు మానడానికి కాస్త టైమ్‌ పడుతోంది. ఈ వయసులో రిస్క్ తీసుకోవడం ఎందుకని ఆయనకు వైద్యులు సూచిస్తున్నారు.

ఈ ప్రమాదం జరగకన్నా ముందే రిభు దాస్‌గుప్తా సెక్షన్‌ 84కి సైన్‌ చేశారు అమితాబ్‌ బచ్చన్‌. నమ్రత్‌ కౌర్‌ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఎక్కువగా రాత్రుల్లో పనిచేయాల్సి ఉంది అమితాబ్‌. హెవీ మోటార్‌ వెహికల్స్, ఫ్యూచరిస్టిక్‌ సినిమా అయినప్పటికీ ప్రాజెక్ట్ కె ఎక్కువగా ఎమోషన్స్ తో సాగుతుందని ఆల్రెడీ అనౌన్స్ చేశారు మేకర్స్. దీపిక, అమితాబ్‌తో ప్రభాస్‌కి ఎక్కువ సన్నివేశాలుంటాయని అంటున్నారు. ఎన్నాళ్లుగానో సౌత్‌లో ఎదురుచూస్తున్న హిట్‌ ప్రాజెక్ట్ కెతో దక్కుతుందని ఆశిస్తున్నారు దిశాపాట్ని.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.