English | Telugu

లాటరీ కింగ్.. 100వ సినిమాని ఇలా స్టార్ట్ చేశారేంటి?

హీరోల కెరీర్ లో 100వ సినిమా అనేది కీలకం. ఆ మైలురాయి చిత్రం కోసం స్టార్ డైరెక్టర్ ని రంగంలోకి దింపడం, భారీ బడ్జెట్ పెట్టడం, లాంచ్ నుంచే భారీ ప్రమోషన్స్ చేయడం వంటివి చూస్తుంటాం. అయితే నాగార్జున మాత్రం నా రూటే సెపరేటు అంటున్నారు. (Akkineni Nagarjuna)

కేవలం ఒక్క సినిమా అనుభవమున్న తమిళ దర్శకుడు రా కార్తీక్ తో నాగార్జున తన 100వ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి నిర్మాత కూడా నాగార్జునే కావడం విశేషం. లాంచ్ విషయంలోనూ నాగార్జున ఊహించని షాకిచ్చారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా సైలెంట్ గా సోమవారం ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేశారు. రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ అయినట్లు సమాచారం.

యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాకి 'లాటరీ కింగ్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇందులో నాగార్జున సరసన ముగ్గురు హీరోయిన్స్ నటిస్తారని తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.