English | Telugu

ఎన్టీఆర్ ఇంకా బాక్స్ఆఫీస్ 'బాద్‌షా'నే..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'రభస' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాపడడంతో ఎప్పటిలాగే కొన్ని మీడియా ఛానెల్స్ ఆయన్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టాయి. టాలీవుడ్ లో ఎన్టీఆర్ పని అయిపోయిందని అంటున్నాయి. ఇతర హీరోలు చేసిన సినిమాలు అవలీలగా 50కోట్ల మార్క్ ను చేరుకొంటుంటే, ఇప్పటికి వరకు ఎన్టీఆర్ కి 45కోట్ల సినిమానే లేదని, అతను నంబర్ రేసులోకి రావడం కష్టమేనని అనేస్తున్నారు. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే..టాలీవుడ్ లో మాస్ లో యంగ్ టైగర్ కి వున్న ఫాలోయింగ్ ఎవరికి లేదనే చెప్పాలి.

'రభస' ఇటీవల ఎన్నో అడ్డంకులు దాటుకొని భారీ వర్షాల నడుమ థియేటర్లలోకి వచ్చింది. అయిన మొదటిరోజు తొమ్మిది కోట్ల షేర్ ను రాబట్టి రికార్డ్ ను సృష్టించింది. అలాగే అమెరికాలో రామ్ చరణ్ 'ఎవడు' సినిమా టోటల్ రన్ లో సాధించిన వసూళ్ళను ఎన్టీఆర్ 'రభస' తొలి మూడు రోజుల్లోనే రాబట్టింది.

గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కూడా వరుస పరాజయాలు వచ్చినప్పుడు ఇలాగే కొంతమంది పవన్ కళ్యాణ్ సినిమాలు మానేస్తే మంచిదని ఉచిత సలహాలు కూడా ఇచ్చారు. కానీ పవర్ స్టార్ 'గబ్బర్ సింగ్' సినిమాతో తిరిగి రికార్డులు బద్దలుకొట్టి 'అత్తారింటికి దారేది'తో తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త చరిత్ర సృష్టించాడు.

అలాగే మహేష్ బాబు కూడా 'పోకిరి' తరువాత కష్టకాలన్ని ఎదురుకొన్నాడు. పోకిరి విజయం కూడా ఏదో అదృష్టం బాగుండి దక్కిందని అన్నారు. ఆ తరువాత మళ్ళీ 'దూకుడు' సినిమాతో తన సూపర్ స్టార్ రెంజును చూపించాడు మహేష్. ఇప్పుడు టాలీవుడ్ లో వరుస విజయాలతో ఆగకుండా ముందుకు దూసుకేళ్తున్నాడు.

ఇవన్ని ఎ౦దుకండీ తెలుగు సినిమా ఇండస్ట్రీకే మెగాస్టార్ గా పిలువబడే చిరంజీవినే, ఒకప్పుడు వరుస ఫ్లాపులు వేధించాయి. ఆ తరువాత మళ్ళీ మెగాస్టార్ వరుస సక్సెస్ లతో తన స్టార్ పవర్ ని రుచిచూపించాడు. అదీ మాస్ లో భీభత్సమైన ఫాలోయింగ్ వున్న హీరోల పవరంటే.


ఎన్ని వరుస పరాజయాలు ఎదురైన కూడా సూపర్ స్టార్ లు ఒక్క హిట్ తో తమ స్థానాన్ని చేరుకోగలరు. అలాగే యంగ్ టైగర్ కూడా త్వరలో ఒక్క హిట్ తో తన స్థానాన్ని చేరుకోగలడు. తిరిగి నెంబర్ వన్ రేసులోకి రాగలడు. ఎనీ డౌట్స్..!!!!!

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.