English | Telugu

యన్ టి ఆర్, బోయపాటి సినిమా జూలై 1 నుంచి

యన్ టి ఆర్, బోయపాటి సినిమా జూలై 1 నుంచి తిరిగి ప్రారంభం కానుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే క్రియెటీవ్ కమర్షియల్స్ పతాకంపై, యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా, హేట్రిక్ విజయాలతో జోరుమీదున్న యువ డైనమిక్ డైరెక్టర్ బోయపాటి శీను దర్శకత్వంలో, కె.యస్.రామారావు నిర్మిస్తున్న"చురకత్తి". సినిమా ఇప్పటికి 14 రోజుల పాటు చిత్రీకరణ జరుపుకుంది. ఈ 14 రోజుల్లో హీరో యన్ టి ఆర్, హీరోయిన్ శృతి హాసన్ లపై కొన్ని రొమాంటిక్ సీన్లనూ, యన్ టి ఆర్, ఆలీ, కోట శ్రీనివాసరావుల మీద కొన్ని సీన్లనూ, యన్ టి ఆర్, రాహుల్ దేవ్ లపై కొన్ని యాక్షన్ సీన్లనూ చిత్రీకరించారు.

మళ్ళీ జూలై 1 నుంచీ ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమై 12 వ తేదీ వరకూ చిత్రీకరణ జరుపుకోనుంది. ఆ తర్వాత ఈ సినిమా ఆగస్ట్ 15 నుండి 31 వ తేదీ వరకూ షూటింగ్ జరుపుకుంటుంది. తర్వాత సెప్టెంబర్ 12 నుండి సినిమా పూర్తయ్యే వరకూ షూటింగ్‍ జరుగుతుందని తెలిసింది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని అందిస్తూండగా, ఎ.యమ్.రత్నం మాటలను వ్రాస్తున్నారు. కోటగిరి వేంకటేశ్వరరావు ఎడిటింగ్ నూ, ఆర్థర్ విల్సన్ సినిమాటోగ్రఫీని, రామ్ -లక్ష్మణ్ యాక్షన్ నూ నిర్వహిస్తున్నారు.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.