English | Telugu

చిరంజీవి సినిమా తర్వాత నన్ను బాయ్ కాట్ చేశారు!

తెలుగు సినీ పరిశ్రమ చూసిన గొప్ప సంగీత దర్శకుల్లో రాజ్-కోటి ద్వయానికి కూడా ఖచ్చితంగా స్థానం ఉంటుంది. వీరిద్దరూ ఎన్నో గొప్ప పాటలను అందించి, పలు సినిమాల విజయాల్లో కీలక పాత్ర పోషించారు. అలాంటిది ఈ ఇద్దరినీ టాలీవుడ్ బాయ్ కాట్ చేసింది. కొంతకాలం అవకాశాలు ఇవ్వకుండా దూరం పెట్టింది. ఈ విషయాన్ని తాజాగా తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా కోటి పంచుకోవడం విశేషం.

మ్యూజిక్ రాయల్టీ విషయంలో మ్యాస్ట్రో ఇళయరాజా చేస్తున్న పోరాటం గురించి ప్రశ్న ఎదురు కాగా.. కోటి ఆసక్తికర సమాధానం ఇచ్చారు. "ఇళయరాజా గారికి మొదటినుండి అగ్రిమెంట్ చేసుకునే అలవాటు ఉండేది. ఆయనకు సొంతంగా క్యాసెట్ కంపెనీ ఉంది. దాంతో ఆడియో రైట్స్ మీకు సంబంధం లేదు అన్నట్టుగా అగ్రిమెంట్ చేసుకునేవారు. ఆ విషయంలో ఇళయరాజా గారు నిజంగా గ్రేట్. అలా ఆయన చేసిన సాంగ్స్ రైట్స్ ఇప్పుడు ఆయన దగ్గరే ఉన్నాయి.

మా విషయం అలా కాదు. తెలుగువాడిగా పుట్టడం మా దురదృష్టం. నేను, రాజ్ కలిసి ఆర్.కె. క్యాసెట్స్ అని ఒక క్యాసెట్ కంపెనీ పెట్టాం. ఇళయరాజా గారిలాగా మేము కూడా సొంతంగా సాంగ్స్ రిలీజ్ చేద్దాం అనుకున్నాం. మొదటి సినిమా చిరంజీవి గారి త్రినేత్రుడు అడిగాం. అయితే నిర్మాతలు అవుట్‌రైట్ కి ఎక్కువ మొత్తం డిమాండ్ చేశారు. మా దగ్గర అంత డబ్బు లేక సేల్స్ ని బట్టి ఇస్తామని చెప్పాము. దానికి వాళ్ళు ఒప్పుకోకపోవడంతో.. ఆ డీల్ కుదరలేదు. మేము దానిని సీరియస్ గా తీసుకోలేదు. కానీ, కొందరు బయటవాళ్ళు మాత్రం వేరే రకంగా ప్రచారం చేశారు. ఆడియో రైట్స్ ఇవ్వకపోతే.. రాజ్-కోటి మ్యూజిక్ చేయనంటున్నారు అని స్ప్రెడ్ చేశారు. దాంతో మాకు సినిమాల్లేకుండా పోయాయి. ఓ రకంగా మమ్మల్ని తెలుగు ఇండస్ట్రీలో బాయ్ కాట్ చేశారు. ఏడాదిన్నర పాటు మాకు ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. ఆ సమయంలో కాట్రగడ్డ ప్రసాద్ గారి ద్వారా కన్నడ పరిశ్రమకు వెళ్ళాము. అక్కడ ఎన్నో హిట్ సాంగ్స్ చేశాము. ముఖ్యంగా 'చిక్ పక్ చిక్ బం' ఆల్బమ్ చాలా పెద్ద హిట్ అయింది. దాంతో మళ్ళీ తెలుగులో ఆఫర్స్ వచ్చాయి." అని కోటి చెప్పుకొచ్చారు.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.