English | Telugu

'ముకుంద' టీజర్ టాక్: మరో పవన్ కళ్యాణ్..!

మెగా బ్రదర్ నాగబాబు కొడుకు వరుణ్‌ తేజ్‌ మొదటి 'ముకుంద' ఆడియో గ్రాండ్ గా రిలీజైంది. ఈ సినిమా థియేట్రీకల్ ట్రైలర్ కూడా ఆడియో ఫంక్షన్ లో విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో ఎలాంటి హడావుడి లేకుండా అతడి నుంచి ఏమి ఎక్స్‌పెక్ట్‌ చేయాలనేది ఫాన్స్‌కి ఒక ఐడియా ఇచ్చేసారు. వరుణ్‌ తేజ్‌ మిగిలిన మెగా హీరోల మాదిరిగా పెద్ద డాన్సర్‌ కాదనే విషయం అయితే స్పష్టమైంది. అయితే బాగా చెయ్యలేడని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డాన్సులు రాకుండానే పవన్‌కళ్యాణ్‌ పవర్‌స్టార్‌ అయ్యాడు. ఇప్పుడు అదే బాటలో వెళుతున్నాడు. పవన్‌కళ్యాణ్‌ లాగే కమర్షియల్‌ సినిమాతో కాకుండా ఫ్యామిలీ సినిమాతో పరిచయమవుతున్నాడు వరుణ్ తేజ్. పవన్ కళ్యాణ్ లాగే వరుణ్ తేజ్ కూడా ఒక సపరేట్ ట్రెండ్ క్రియేట్ చేయాలని ఆశిద్దాం.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.